కీర్తిసురేష్ సినిమాకు రెండు టైటిల్స్

ఎక్కడైనా సినిమాకు ఒకటే పేరు ఉంటుంది. అదే పేరు మీద ప్రమోషన్ నడుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ విచిత్రమైన పరిస్థితి. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఓ సినిమాకు రెండు పేర్లు పెట్టారు.…

ఎక్కడైనా సినిమాకు ఒకటే పేరు ఉంటుంది. అదే పేరు మీద ప్రమోషన్ నడుస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ విచిత్రమైన పరిస్థితి. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఓ సినిమాకు రెండు పేర్లు పెట్టారు. ఇద్దరు నిర్మాతలు వేర్వేరుగా ప్రచారం చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో ఇదొక వింత పరిస్థితి.

సీనియర్ నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్ గా రాంప్రసాద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీనికి “అయినా ఇష్టం నువ్వు” అనే టైటిల్ ఫిక్స్ చేశాడు నిర్మాత నట్టికుమార్. ఇదే టైటిల్ తో ఆయన పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు.

కట్ చేస్తే.. ఇదే హీరోహీరోయిన్లు నటిస్తున్న, ఇదే సినిమాకు “జానకితో నేను” అనే టైటిల్ ఫిక్స్ చేశాడు నిర్మాత చంటి అడ్డాల. ఏకంగా మూవీ నుంచి కీర్తిసురేష్ ఎక్స్ క్లూజివ్ స్టిల్స్ కొన్ని రిలీజ్ చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న నట్టికుమార్ మరో అడుగు ముందుకేశాడు. “అయినా ఇష్టం నువ్వు” టైటిల్ తో ఏకంగా టీజర్ రిలీజ్ చేశాడు. హీరోహీరోయిన్లకు వేరే వ్యక్తులతో డబ్బింగ్ చెప్పించి మరీ టీజర్ విడుదల చేశాడు.

ఇలా ఓ రేంజ్ లో ఈ ఇద్దరు నిర్మాతల మధ్య ఈ సినిమా హక్కులపై ఓపెన్ ఫైట్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని తనకు చంటి అమ్మేశారని నట్టి కుమార్ వాదిస్తున్నారు. తన దగ్గర బాండ్ పేపర్ సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయంటున్నారు. అదనపు మొత్తం కోసం చంటి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

అటు చంటి అడ్డాల మాత్రం ఇవేం పట్టించుకోవట్లేదు. తమ సినిమాకు ముందుగా ''ఐనా…ఇష్టం నువ్వు'' అన్న పేరు పెట్టినప్పటికీ.. తాజాగా “జానకితో నేను” అనే టైటిల్ మరింత బావుంటుందన్న ఉద్దేశ్యంతో టైటిల్ మార్చేశామని ఈయన చెబుతున్నాడు.

ఇలా ఒకే సినిమాకు ఇద్దరు నిర్మాతలు, వేర్వేరు టైటిల్స్ పెట్టి ఒకేసారి ప్రచారం చేసుకుంటున్నారు. గమ్మతైన విషయం ఏంటంటే.. ఈ సినిమా ప్యాచ్ వర్క్ షూటింగ్ కు కీర్తిసురేష్ రావాల్సి ఉంది. ఆమె తమ సెట్స్ పైకి వస్తుందని ఓ నిర్మాత అంటుంటే.. కాదు, తమ సెట్స్ పైకి వస్తుందని మరో నిర్మాత చెబుతున్నాడు. 

ప్రభుత్వం న్యాయ వ్యవస్థ చేతుల్లో ఉందా?

చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్న అమరావతి