బన్నీ పై ఫిర్యాదు, అయినా ….

హీరో బన్నీ నిలువునా ఇరుక్కున్నాడు. మరీ మర్డర్ కేసు లాంటి భయంకరమైనది కాదు కానీ నిబంధనల ఉల్లంఘన కేసు చుట్టుకునేలా వుంది. అత్యుత్సాహంతో ఇటీవల బన్నీ తన స్నేహితులతో కలిసి కుంటాల జలపాతం సందర్శించడానికి…

హీరో బన్నీ నిలువునా ఇరుక్కున్నాడు. మరీ మర్డర్ కేసు లాంటి భయంకరమైనది కాదు కానీ నిబంధనల ఉల్లంఘన కేసు చుట్టుకునేలా వుంది. అత్యుత్సాహంతో ఇటీవల బన్నీ తన స్నేహితులతో కలిసి కుంటాల జలపాతం సందర్శించడానికి వెళ్లాడు.

వెళ్లడమే కాదు, డిస్కవరీ చానెల్, నేషనల్ జియోగ్రఫీ చానెళ్లలో జనాలు వేసుకునేలా సఫారీ జాకెట్ వేసుకుని, మాంచి గెటప్ తో ఫొటోలు కూడా దిగాడు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  అదిలాబాద్ జిల్లా కుంటాల జలపాత సందర్శనను ప్రభుత్వం నిలిపేసినా.. అల్లు అర్జున్, `పుష్ప` టీమ్ సభ్యులు అక్కడకు వెళ్లారని ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు అందింది. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై సమాచార హక్కు సాధనా స్రవంతి ప్రతినిధులు అదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్, `పుష్ప` చిత్ర యూనిట్ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కుంటాల జలపాతాన్ని సందర్శించారని వారు పోలీసులకు తెలిపారు.

అల్లు అర్జున్, `పుష్ప` టీమ్ సభ్యులు అక్కడకు వెళ్లారని, అనుమతులు లేకుండా తిప్పేశ్వర్‌లో షూటింగ్ చేశారని సమాచార హక్కు సాధనా స్రవంతి ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు. 

బన్నీ లాంటి పెద్ద స్టార్, పలుకుబడి వున్న స్టార్ పై ఫిర్యాదు చేస్తే అంత సులువుగా కేసు కట్టేయడం, ఇలాంటి వ్యవహారాలు చకచకా జరిగిపోవు. మధ్యలో రాజీలు, ఇతరత్రా సిఫార్సులు ఇలాంటివి చాలా వుంటాయి. అందువల్ల బన్నీ మీద ఫిర్యాదు అనేంత వరకే తప్ప, అంతకుమించి ఏమీ వుండకపోవచ్చు.

చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్న అమరావతి

బోండా ఉమకి నిన్న రాత్రే ఎలా తెలిసిపోయింది