హరిబాబు హాట్ కామెంట్స్…?

బీజేపీని తేడా గల పార్టీ అంటారు. అంటే మిగిలిన పార్టీలకు భిన్నమైన  పార్టీ అని వారి భావన. అయితే కాలక్రమంలో  అన్ని పార్టీల‌లోని జాడ్యాలు బీజేపీలోకి కూడా వచ్చి చేరాయని విమర్శలు చాలానే ఉన్నాయి.…

బీజేపీని తేడా గల పార్టీ అంటారు. అంటే మిగిలిన పార్టీలకు భిన్నమైన  పార్టీ అని వారి భావన. అయితే కాలక్రమంలో  అన్ని పార్టీల‌లోని జాడ్యాలు బీజేపీలోకి కూడా వచ్చి చేరాయని విమర్శలు చాలానే ఉన్నాయి.

ఇవన్నీ ఇలా ఉంటే బీజేపీలో వ్యక్తి పూజకు స్థానం లేదు. అది ఆరెస్సెస్ సిద్ధాంతం. పదవులు, వ్యక్తుల కంటే సంస్థ ముఖ్యమని ఆరెస్సెస్ భావిస్తుంది. ఆ సంస్థకు రాజకీయ కొమ్మ అయిన బీజేపీలోనూ అదే విధానం ఉంది.

అందుకే మహామహులు నడిపిన బీజేపీలో నాయకులు ఎవరన్నది తెలియకుండా పార్టీయే జనాలకు ఎపుడూ గుర్తుకువస్తుంది. పార్టీని మించి నాయకుడు కనిపించే కల్చర్ ఆ పార్టీలో గతంలో ఎపుడూ లేదు, కానీ మోడీ వచ్చాకా బీజేపీ కంటే ఆయనే మెరుస్తున్నారు. ఆయనే పార్టీ అన్నట్లుగా కూడా కనిపిస్తున్నారు అన్న విమర్శ‌లు ఉన్నాయి.

ఇవన్నీ ఇలా ఉంటే ఆరెస్సెస్ నేపధ్యం నుంచి వచ్చిన వారిలో ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్ కంభంపాటి హరిబాబు కూడా ఒకరు. ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఏ ఉద్దేశ్యంతో చేశారో కానీ ఒక కామెంట్ మాత్రం కాస్తా హాట్ గానే ఉందనిపిస్తోంది.

అదేంటి అంటే బీజేపీలో నాయకుల జన్మదినాలు ఉత్సవాలుగా జరిపే కల్చర్ లేదని ఆయన అంటున్నారు. మరి మోడీ పుట్టిన రోజు గతంలో జరిగినా కూడా ఒక్క రోజు మాత్రమే నేతలు కార్యక్రమాలు జరిపేవారు. ఇపుడు ఏపీలో ఏడు రోజుల పాటు సప్తాహాలు నిర్వహించడంపైనే హరిబాబు కామెంట్స్ చేశారు అనుకోవాలేమో. మొత్తానికి హరిబాబు బీజేపీ పద్ధతి ఇది కాదు అని చెప్పి నిప్పు రాజేశారా. అలా రాజేస్తే ఎవరి మీద ఆయన బాణాలు వేశారనుకోవాలో..

ప్రభుత్వం న్యాయ వ్యవస్థ చేతుల్లో ఉందా?

చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్న అమరావతి