హీరో నిఖిల్‌ను ఫుట్‌బాల్ ఆడిన వ‌ర్మ‌

హీరో నిఖిల్ తెలిసి తెలిసి ఎవ‌రూ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ‌తో పెట్టుకోరు. ముళ్లు ఆకుమీద ప‌డినా లేక ఆకు పోయి ముళ్లు మీద ప‌డినా…చివ‌రికి చిరిగేది ఆకే. వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ‌తో గెలుక్కోవ‌డం కూడా…

హీరో నిఖిల్ తెలిసి తెలిసి ఎవ‌రూ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ‌తో పెట్టుకోరు. ముళ్లు ఆకుమీద ప‌డినా లేక ఆకు పోయి ముళ్లు మీద ప‌డినా…చివ‌రికి చిరిగేది ఆకే. వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ‌తో గెలుక్కోవ‌డం కూడా అలాంటిదే.  ప‌వ‌ర్‌స్టార్ సినిమా రేకెత్తిస్తున్న వివాదం అంతాఇంతా కాదు. ఈ నేప‌థ్యంలో త‌న అభిమాన హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ‘ప‌వ‌ర్‌స్టార్‌’ పేరుతో వ్యంగ్య సినిమా తీసిన వ‌ర్మ‌పై హీరో నిఖిల్ ట్విట‌ర్ వేదిక‌గా ఘాటుగా స్పందించిన విష‌యం తెలిసిందే.

‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మోరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు.. మీకు అర్థం అయ్యిందిగా’ అంటూ నిఖిల్ బుధ‌వారం చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఇందులో ఎక్క‌డా రాంగోపాల్‌వ‌ర్మ పేరు ప్ర‌స్తావించ‌క పోయినా…ప్ర‌స్తుత ప‌రిస్థితిని బ‌ట్టి ఎవ‌రిని ఉద్దేశించో అంద‌రికీ తెలిసిపోయింది.

ఈ నేప‌థ్యంలో ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నిఖిల్ ట్వీట్‌పై వ‌ర్మ‌ను ప్ర‌శ్నించ‌గా దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చాడు.

‘నిఖిల్‌ ఎవడో నాకు తెలియదు. నిఖిల్‌ కావచ్చు, కిఖిల్‌ కావచ్చు. వాళ్లందరూ కూడా ఒకే కోవకు చెందినవాళ్లు. పవన్ కల్యాణ్‌ కింద తొత్తులుగా ఉంటారు. ఇలా తొత్తుల్లా ఉంటే పవన్ క‌ల్యాణ్‌కు వీళ్ల మీద ఏదో మంచి అభిప్రాయం వస్తుందని వారి ఆశ. పవన్ కు మద్దతుగా ఉండేవాళ్ళంతా ఒక బానిసత్వానికి చెందిన వాళ్ళు. బానిసత్వం బుద్ధిలో నుంచి వచ్చే ఆలోచన ఇది. నిఖిల్‌ ఒక పెద్ద స్టార్‌ అయ్యుండొచ్చు.. కానీ వాడు ఎవడో నాకు తెలీదు’ అని వర్మ ఘాటుగా స‌మాధానం ఇచ్చాడు.

వ‌ర్మ‌పై నిఖిల్ ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పిస్తే…వ‌ర్మ మాత్రం ఆ మ‌ర్యాద పాటించాల‌ని భావించ‌లేదు. త‌న మాట‌ల‌తో నిఖిల్‌ను ఫుట్‌బాల్ ఆడాడ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతేగా ఎదుటి వాళ్ల‌ని ఒక మాట అంటే…అక్క‌డి నుంచి ప‌ది మాట‌లు మ‌నపై దాడి చేస్తాయి. ఇదే క‌దా చ‌ర్య‌కు ప్ర‌తిచ‌ర్య అనే న్యూట‌న్ మూడో సిద్ధాంతం చెప్పేది. 

జగనన్నని అడిగి నర్సాపురం సీటు తెచుకుంటా

ఆర్జీవీ చాలా తెలివైనోడు