వర్మా.. ఇలా కాలిందేమిటయ్యా నీ ఖర్మ…ఈ పాటకు తగ్గట్టే యూట్యూబ్‌లో జరిగింది. యూట్యూబ్ నుంచి ఎవరో ఈ పాటను తొలగించారు. వర్మ తనపై పాజిటివ్, నెగిటివ్ ఏదైనా సమానంగా తీసుకుంటారు. ఎందుకంటే తనపై చర్చ జరగడం ముఖ్యం…అది మంచా? చెడా? అనేది తర్వాత విషయం…ఇదీ వర్మ ఫిలాసఫీ.
పవర్‌స్టార్ అంటూ పవన్‌కల్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు సినిమా తీసినప్పటి నుంచి…అనేక వివాదాలు తెరపైకి వచ్చాయి. వర్మపై పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కూడా సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు. వర్మపై పరాన్నజీవి అనే టైటిల్‌తో నూతన్‌నాయుడు సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఆ పరంపరలోనే సీనియర్ జర్నలిస్టు ప్రభు దర్శకత్వంలో “రాంగ్ గోపాల్‌వర్మ” అనే సినిమాను వర్మపై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ `వర్మా.. ఇలా కాలిందేమిటయ్యా నీ ఖర్మ…` ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 2న విడు దల చేసి, పవన్‌ఫ్యాన్స్‌కు పాటను అంకితం ఇచ్చారు. ఇంత వరకూ బాగానే ఉంది.
యూట్యూబ్ హ్యాకర్స్ చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చారు. ఈ పాటను యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు. ఎవరు, ఎందుకు డిలీట్ చేశారనే విషయమై చిత్ర యూనిట్ ఆరా తీయడం మొదలు పెట్టింది. మొత్తానికి పవన్ ఫ్యాన్స్‌కు ఎవరో తెలియదు కానీ…బాగా షాక్ ఇచ్చారు.