మంచు కురిసే మన్యం పిలుస్తోంది..!

ఊటీ, కాశ్మీర్ అందాలకు మారు పేర్లు. అక్కడ చల్లదనం, మంచుదనం స్వయంగా అనుభవించాలని, పరవశించాలని ప్రతీ ఒక్క ప్రక్రుతి ప్రేమికుడు పరితపిస్తాడు. అయితే అంత దూరం వెళ్లడం అవసరం లేదు, విశాఖ మన్యంలోనే మంచు…

ఊటీ, కాశ్మీర్ అందాలకు మారు పేర్లు. అక్కడ చల్లదనం, మంచుదనం స్వయంగా అనుభవించాలని, పరవశించాలని ప్రతీ ఒక్క ప్రక్రుతి ప్రేమికుడు పరితపిస్తాడు. అయితే అంత దూరం వెళ్లడం అవసరం లేదు, విశాఖ మన్యంలోనే మంచు తెరలు స్వాగతం పలుకుతాయి. జలపాతాలు ఆకట్టుకుంటాయి.

పర్యాటకులకు ఆదరంగా ఆహ్వానం అందిస్తాయి. విశాఖలో అరకు పాడేరు ప్రాంతాలను ఆంధ్రా ఊటీ, కాశ్మీర్ అని పొగుడుతారు. ఇక్కడకు వచ్చిన వారెవరూ అంత తొందరగా ఆ మధురానుభూతులను మరచిపోలేరు.  ప్రతీ ఏటా సెప్టెంబర్ నెల మొదలుకాగానే మన్యం మంచుపల్లకీలో ఊరేగుతుంది. దాదాపుగా అ నాలుగైదు నెలల పాటు అద్భుతమైన వాతావరణం అక్కడ ఉంటుంది.

ప్రతీ ఏడాది ఇదే సమయంలో పర్యాటకులు విశాఖ మన్యానికి  పెద్ద ఎత్తున తరలి వచ్చేవారు. ఈ ప్రాంతాలు జనాలతో కళకళలాడేవి. అందమైన జలపాతాలు సైతం మైమరపించేవి. ఈసారి మాత్రం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా జనాలు ఈ వైపు చూడడంలేదు.

దాంతో ఆంధ్రా ఊటీ వెలవెలబోతోంది ఈ ప్రాక్రుతిక అందాలు, సహజసిధ్ధమైన సౌందర్యాలు స్థానికులకు ఉల్లాసాన్ని కలిగిస్తున్నా కూడా టూరిస్టులు రాకపోవడం వల్ల ఉపాధి పోతోందని ఆవేదన చెందుతున్నారు. నాలుగైదు నెలలు ఇదే రకమైన వాతావరణం ఉంటుంది కాబట్టి కరోనా తగ్గితేనే మన్యసీమలు కళకళలాడే అవకాశాలు ఉండొచ్చేమో.

సినిమా రివ్యూ: వి