నాగశౌర్య హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న సినిమా 'వరుడు కావలెను'..హీరో పుట్టిన రోజు సందర్భంగా చిన్న విడియో వదిలారు.
Advertisement
నాగశౌర్యను మాంచి స్టయిలిష్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు ఈ విడియోలో క్లారిటీ ఇచ్చేసారు.
లక్ష్య సినిమా కోసం ఎయిట్ ప్యాక్ చేసాడు నాగశౌర్య. దాన్ని ముందుగానే ఈ విడియోలో చూపించేసారు. ఆపైన స్టయిలిష్ అసెసరీస్ అన్నీ సెట్ చేసి, మాంచి అందమైన వరుడిగా హీరోను ప్రెజెంట్ చేసారు.
ఈ ఏడాది మే నెలలో ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది. నాగవంశీ నిర్మాత. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు.