జీ టీవీకి ‘నాంది’

అల్లరి నరేష్ చేస్తున్న వైవిధ్యమైన సినిమా నాంది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన టీజర్ తదితర మెటీరియల్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. సతీష్ వేగ్నిశ నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు విజయ్.  Advertisement…

అల్లరి నరేష్ చేస్తున్న వైవిధ్యమైన సినిమా నాంది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన టీజర్ తదితర మెటీరియల్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. సతీష్ వేగ్నిశ నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు విజయ్. 

వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలకపాత్ర చేసిన సినిమా ఇది. ఈ సినిమాకు ఇప్పుడు మాంచి హోల్ సేల్ బేరం వచ్చిందని తెలుస్తోంది. 

సినిమా వరల్డ్ నెగిటివ్ రైట్స్ మొత్తం జీటీవీ తీసుకోవడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ పెండింగ్ లో వుంది కానీ డిస్కషన్లు పూర్తయినట్లు తెలుస్తోంది. 

ఎనిమిది కోట్లకు ఇటో, అటో రేటు ఫిక్స్ ఛేసినట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ పూర్తయితే, సినిమాను జీ 5 లో, జీ టీవీలో విడుదల చేస్తారు. అలాగే థియేటర్లలో కూడా జీ టీవీనే విడుదల చేస్తుంది.

ఈ సినిమా మీద హీరో నరేష్ మంచి హోప్ తో వున్నారు. కామెడీ పాత్రల నుంచి సీరియస్ పాత్రల వైపు మళ్లాలని ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే వున్నారు. ఈసారి అది ఫలిస్తుందని భావిస్తున్నారు.

క్రాక్ సినిమా బాలీవుడ్ లో ఆ హీరోతో తీస్తా

క‌థ మొత్తం బంగారం చూట్టే