బోయపాటి-సూర్య…పాజిబుల్?

క్రేజీ కాంబినేషన్ ల కోసం ప్రయత్నిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. అందులో భాగంగా డైరక్టర్ బోయపాటి-తమిళ సూపర్ స్టార్ సూర్యలతో ఓ ఉభయభాషల సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  Advertisement బోయపాటితో దిల్…

క్రేజీ కాంబినేషన్ ల కోసం ప్రయత్నిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. అందులో భాగంగా డైరక్టర్ బోయపాటి-తమిళ సూపర్ స్టార్ సూర్యలతో ఓ ఉభయభాషల సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

బోయపాటితో దిల్ రాజు సినిమా అన్నది ఎప్పటి నుంచో వార్తల్లో వుంది. గతంలో ప్రభాస్ కోసం బోయపాటి ఒక బలమైన ఎమోషనల్ యాక్షన్ కథ తయారుచేసి వుంచారు.

ఇప్పుడు ఆ కథను సూర్యతో చేయించాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారని బోగట్టా. సూర్య కూడా ఎప్పటినుంచో తెలుగులో ఓ సినిమా చేయాలన్న ఆలోచనతోనే వున్నారు. 

సరైన సబ్జెక్ట్, సరైన లాంచింగ్ కావాలన్నది ఆయన ఆలోచన. ఇప్పుడు అందుకే దిల్ రాజు ఈ ప్రపోజల్ ను సూర్య ముందు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

దర్శకుడు బోయపాటి ప్రస్తుతానికి బాలయ్యతో ఓ సినిమా చేస్తున్నారు. అది త్వరలో పూర్తయిపోతుంది. అ రిజల్ట్ చూసిన తరువాత ఈ ప్రాజెక్టుకు ఊపు వచ్చే అవకాశం వుంది. 

క‌థ మొత్తం బంగారం చూట్టే

క్రాక్ సినిమా బాలీవుడ్ లో ఆ హీరోతో తీస్తా