వరుడు కావలెను అనే సినిమా విడుదలవుతోంది. సినిమాకు ఓ పాజిటివ్ కలర్ వుంది. కాస్త పుష్ చేస్తే మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం వుంది. కానీ ఆ దిశగా సినిమా ప్రమోషన్ టీమ్ వర్క్ చేస్తున్నట్లు కనిపించడం లేదు.
సోషల్ మీడియాలో సినిమా పబ్లిసిటీ చాలా వీక్ గా వుందని, అలాగే రెండు మంచి పంక్షన్లు జరిగినా వాటి కవరేజ్ ఎక్కడా పెద్దగా కనిపించడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
గమ్మత్తేమిటంటే మరో 24 గంటల్లో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వుంది. కానీ దీని డిటైయల్స్ తెలియవు. ఎవరు చీఫ్ గెస్ట్ అన్నది తెలియదు. లాస్ట్ మినిట్ లో ఫంక్షన్ డిటైయల్స్ అనౌన్స్ చేస్తే ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
బ్యానర్ కు ఎంత పేరు వున్నా, కొత్త దర్శకురాలు, మిడ్ రేంజ్ హీరో అయినపుడు పబ్లిసిటీ భయంకరంగా జరగాల్సి వుంది. దీనికి కౌంటర్ గా వస్తున్న రొమాంటిక్ సినిమా హడావుడి మామూలుగా లేదు. ట్విట్టర్, ఫేస్ బుక్ ఓపెన్ చేస్తే అదే కనిపిస్తోంది. వరుడు కావలెను కోసం వెదుక్కోవాల్సి వస్తోంది.
వరుడు కావలెను టీమ్ పనితనం గురించి చెప్పడానికి ఓ ఉదాహరణ ఏమిటంటే, నిన్నటికి నిన్న హీరో హీరోయిన్లు సర్ప్రయిజ్ గెస్ట్ లుగా రెండు మూడు పెళ్లిళ్లకు వెళ్లారు. ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ ఆ ఫొటోలు వదిలారు. కొన్ని ఫొటోల్లో హీరో కళ్లు మూసుకుని వున్నవి వుండడం విశేషం. అంటే ఏ ఫొటొలు వదులుతున్నారో క్వాలిటీ చూసేవారు కూడా లేరన్నమాట అక్కడ.