బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తండ్రి అయ్యాడు. అతడి భార్య నటాషా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వరుణ్ ధావన్ అధికారికంగా ప్రకటించాడు. తన భార్య, కూతురు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపాడు.
ఫ్యాషన్ డిజైనర్ నటాషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వరుణ్ ధావన్. 2021, జనవరి 24న ముంబయిలో వీళ్ల పెళ్లి సింపుల్ గా జరిగింది. కరోనా కారణంగా పెళ్లికి పెద్దగా ఎవ్వర్నీ ఆహ్వానించలేదు.
బాలీవుడ్ లో ఆదర్శవంతమైన కపుల్ గా వీళ్లు కొనసాగుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఫిబ్రవరిలో తన భార్య గర్భం దాల్చిన విషయాన్ని వరుణ్ ప్రకటించాడు. అయితే అప్పటికే ఆమె బేబీ బంప్ ఫొటోలు బయటకొచ్చాయి. ఈరోజు ఆమె దలాల్ లోని ఓ హాస్పిటల్ లో బిడ్డకు జన్మనిచ్చింది.
ప్రస్తుతం బేబీ జాన్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు వరుణ్ ధావన్. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ కోసం సమంతతో కలిసి సిటాడెల్ సిరీస్ చేశాడు. ఈమధ్య కాలంలో సమంతతో ఎక్కువగా కనిపించడంతో, సౌత్ లో కూడా ఇతడు కాస్త పాపులర్ అయ్యాడు.