నాగబాబు.. ఈ వ్యక్తి ఏం మాట్లాడినా వివాదమే. ఏం చేసినా కాంట్రవర్సీనే. చివరికి సినిమా ఫంక్షన్ లో కూడా తనకు తెలియకుండానే తన వ్యాఖ్యలతో వివాదాస్పదమయ్యారు నాగబాబు.
ఆరడుగులున్న తన కొడుకును పొగిడే క్రమంలో ఐదడుగుల హీరోలు కూడా పోలీస్ పాత్రలు చేస్తున్నారంటూ వెటకారం ఆడారు. ఇంతకీ నాగబాబు ఏమన్నారంటే…
“కొన్నిసార్లు, కొన్ని క్యారెక్టర్లు క్యారీ చేయాలంటే ఒక 5 అడుగుల 3 అంగుళాలు ఉన్నవాడు, నేను పోలీసాఫీసర్ ను అంటూ ముందుకొస్తే చూడ్డానికి కామెడీగా ఉంటుంది. నువ్వు కాదులేరా బాబూ అనిపిస్తుంది.”
నాగబాబు ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ చుట్టూ సోషల్ మీడియాలో చాలా రచ్చ జరిగింది. ఎన్టీఆర్ ను ఉద్దేశించి నాగబాబు ఆ వ్యాఖ్యలు చేశారని కొందరు అంటే, జంజీర్ లో రామ్ చరణ్ ను ఉద్దేశించి అలా అన్నారంటూ మరికొందరు రివర్స్ అయ్యారు.
ఈ సోషల్ మీడియా వార్ పై ఈరోజు వరుణ్ తేజ్ స్పందించాడు. హైట్ కు సంబంధించి తన తండ్రి చేసిన వ్యాఖ్యలు ఎవ్వర్నీ ఉద్దేశించినవి కావని, కేవలం తన హైట్ ను దృష్టిలో పెట్టుకొని, పోలిక కోసం ఆయన 5.3 అడుగులు అన్నారని, అంతకుమించి మరో హీరోను ఎద్దేవా చేసే ఉద్దేశం నాగబాబుకు లేదని క్లారిటీ ఇచ్చాడు.
తను 6.3 అడుగుల ఎత్తు ఉన్నానని, అందుకే 5.3 అడుగుల రిఫరెన్స్ తో తన తండ్రి చిన్న పోలిక తీశారని, అంతేతప్ప, మరో హీరోను కించపరిచే ఉద్దేశం ఆయనకు ఏకోశానా లేదని క్లారిటీ ఇచ్చాడు.
వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా కోసం 2 నెలల పాటు హిందీ క్లాసులు తీసుకున్నాడట వరుణ్. హిందీలో తను చాలా బాగా డబ్బింగ్ చెప్పానని, ఎంతలా అంటే.. హిందీలో షూట్ చేసిన తర్వాత అదే సీన్ ను తెలుగులో షూట్ చేస్తున్నప్పుడు, మధ్యమధ్యలో హిందీ డైలాగ్స్ కూడా వచ్చేసేవని అన్నాడు.