కొత్త స్టెప్పులే కాదు.. డిఫరెంట్ గెటప్స్ కూడా!

ఎఫ్3 సినిమాలో వరుణ్ తేజ్ తో దర్శకుడు అనీల్ రావిపూడి కొత్త కొత్త స్టెప్పులు వేయించిన సంగతి తెలిసిందే. తన నత్తిని కవర్ చేసుకునేందుకు వరుణ్ ఇలా డాన్స్ చేస్తుంటాడన్నమాట. అయితే ఈ సినిమాలో…

ఎఫ్3 సినిమాలో వరుణ్ తేజ్ తో దర్శకుడు అనీల్ రావిపూడి కొత్త కొత్త స్టెప్పులు వేయించిన సంగతి తెలిసిందే. తన నత్తిని కవర్ చేసుకునేందుకు వరుణ్ ఇలా డాన్స్ చేస్తుంటాడన్నమాట. అయితే ఈ సినిమాలో వరుణ్ తో స్టెప్పులు మాత్రమే కాదు, కొత్త కొత్త గెటప్స్ కూడా వేయించాడట దర్శకుడు.

“ఈ సినిమాలో నాకు నత్తి ఉంది. దాన్ని కవర్ చేసేందుకు రకరకాల స్టెప్పులు వేస్తుంటాను. అయితే స్టెప్పులే కాకుండా, రకరకాల గెటప్స్ కూడా ఉన్నాయి. సినిమాలో 10-15 గెటప్స్ వేశాను. ఓసారి పోలీసాఫీసర్ గా, ఇంకోసారి పూజారిగా.. ఇలా చాలా గెటప్స్ ఉన్నాయి.”

ఇలా సినిమాలో తనకు డిఫరెంట్ గెటప్స్ కూడా ఉన్నాయనే విషయాన్ని బయటపెట్టాడు వరుణ్ తేజ్. ఇక యాక్టింగ్ విషయానికొస్తే.. స్టార్టింగ్ లో ఎఫ్3లో నటించడానికి చాలా కష్టమైందని, ఆ తర్వాత అదే చాలా ఈజీ అయిపోయిందని అన్నాడు. కెమెరా ముందు ఎంత కామెడీ చేశామో, కెమెరా వెనక సెట్స్ లో అంతకంటే ఎక్కువ కామెడీ చేశామని తెలిపాడు.

ఎఫ్2లో హీరోయిన్లపై ఫ్రస్ట్రేషన్ లో హీరోలిద్దరూ యూరోప్ వెళ్లిపోతారు. మరి ఎఫ్3లో అలాంటి సందర్భం ఉందా? ఈసారి హీరోలిద్దరూ విజయనగరం వెళ్తారట. ఆ మేటరేంటో తెలియాలంటే ఎఫ్3 చూడాలంటున్నాడు వరుణ్ తేజ్.