గుర్రం పైనుంచి కిందపడిన మెగాహీరో

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోహీరోయిన్లంతా తమ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియానే నమ్ముకున్నారు. కొందరు వీడియో ఛాట్స్ తో ఎంటర్ టైన్ చేస్తుంటే.. మరికొందరు చిట్ చాట్…

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోహీరోయిన్లంతా తమ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియానే నమ్ముకున్నారు. కొందరు వీడియో ఛాట్స్ తో ఎంటర్ టైన్ చేస్తుంటే.. మరికొందరు చిట్ చాట్ తో సరిపెడుతున్నారు. ఇందులో భాగంగా హీరో వరుణ్ తేజ్ కూడా ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా తనకు ఎదురైన ఓ చేదు జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

ఇంటరాక్షన్ లో భాగంగా గుర్రపుస్వారీ గురించి ఓ అభిమాని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న అడిగిన వెంటనే వరుణ్ తేజ్ గతంలోకి వెళ్లిపోయాడు. గతంలో ఓసారి రామ్ చరణ్ తో కలిసి గుర్రపుస్వారీ ప్రాక్టీస్ చేశానని, కానీ ఆ టైమ్ లో గుర్రంపై నుంచి కింద పడ్డానని గుర్తుచేసుకున్నాడు. ఆ ఘటన తర్వాత మళ్లీ ఇప్పటివరకు గుర్రం ఎక్కలేదంటున్నాడు వరుణ్ తేజ్.

మెగా హీరోల్లో చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయితేజ్ కు గుర్రపుస్వారీ వచ్చు. వీళ్లంతా ఏదో ఒక టైమ్ లో తమ హార్స్ రైడింగ్ టాలెంట్ ను చూపించారు. ఈ లిస్ట్ నుంచి వరుణ్ తేజ్ మాత్రం తప్పుకున్నాడు. భవిష్యత్తులో రాజులు, కత్తులు, యుద్ధాలు, గుర్రాలు కాన్సెప్ట్ తో ఓ సినిమా ఆఫర్ వస్తే అప్పుడేం చేస్తాడో చూడాలి.

అన్నట్టు ఈ ఛిట్ చాట్ లో మల్టీస్టారర్ ఆలోచనల్ని కూడా షేర్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. సాయితేజ్ తో కలిసి మల్టీస్టారర్ చేయాలని ఉందని చెప్పిన వరుణ్.. పవన్ కల్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తే తనంత అదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరని చెబుతున్నాడు.

జగన్ గారే దేశంలో నెం.1 ముఖ్యమంత్రి

జగన్ కి చంద్రబాబు కి ఉన్న తేడా అదే