అధికారులూ అప్రమత్తంగా ఉండాల్సిందే..!

ఏపీలో కరోనా కష్టకాలంలో ప్రభుత్వ అధికారుల పనితీరును మెచ్చుకోవాల్సిందే. వైద్య, పోలీస్, పారిశుధ్య సిబ్బంది పూర్తిస్థాయిలో విధులకు అంకితమైతే.. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా…

ఏపీలో కరోనా కష్టకాలంలో ప్రభుత్వ అధికారుల పనితీరును మెచ్చుకోవాల్సిందే. వైద్య, పోలీస్, పారిశుధ్య సిబ్బంది పూర్తిస్థాయిలో విధులకు అంకితమైతే.. జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా కరోనా విపత్తు వేళ, ప్రజలకు ఆర్థిక సాయం, రేషన్ పంపిణీ వంటి విషయాల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది శక్తికి మించి పనిచేస్తున్నారు. అయితే అనుకోని ఉపద్రవం ఇప్పుడు వీరందర్నీ ఆలోచనలో పడేసింది.

అనంతపురం జిల్లాలో ఓ తహశీల్దార్ కు కరోనా సోకడం, ఆయనను ఐసోలేషన్ వార్డులో ఉంచడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కరోనా సోకకుండా ఉండాలంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, రోజుకు పదిసార్లు చేతులు శుభ్రం చేసుకోవాలి, సామాజిక దూరం పాటించాలంటూ.. సూచనలిచ్చే అధికారులే కొన్నిసార్లు పని ఒత్తిడిలో పడిపోయి ఈ నియమాల్ని మర్చిపోతున్నారు. అలాంటి ఓ ఘటన వల్లే తహశీల్దార్ కు కరోనా సోకింది.

అప్పటికే ఆయన ఎమ్మెల్యే రివ్యూలో పాల్గొన్నారు, ఇతర అధికారులతో కలసి ప్రతి రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన తహశీల్దార్ పేరు, మండలం గోప్యంగా ఉంచినా.. స్థానికంగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లిన ప్రజలంతా భయంతో హడలిపోతున్నారు. ఆయనతో సన్నిహితంగా ఉన్న సిబ్బంది, ఇతర డిపార్ట్ మెంట్ ల ఉద్యోగులు కూడా కరోనా భయంతో వణికిపోతున్నారు.

కేవలం విధులకు హాజరు కావడం, ఇతరులకు సూచనలివ్వడమే కాదు, తమకు తాము కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నామా లేదా అని చూసుకోవాల్సిన పరిస్థితి కూడా అధికారులపై ఉంది అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. రాజు, రాణి, ప్రధాని, ఐఏఎస్ అధికారి.. ఇలా కరోనా ఎవరినీ వదిలిపెట్టదని ఇదివరకే రుజువైంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ అధికారులు తమ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. లాక్ డౌన్ పటిష్ట అమలుని పర్యవేక్షిస్తూనే.. స్వీయ నియంత్రణ పాటించాలి. అలా చేయకపోతే అధికారుల వల్లే అనర్థాలు జరుగుతాయి. ప్రభుత్వ ఆశయాన్ని, అధికారులే నీరుగార్చిన వారవుతారు. 

జగన్ గారే దేశంలో నెం.1 ముఖ్యమంత్రి

జగన్ కి చంద్రబాబు కి ఉన్న తేడా అదే