వాయిదా దిశగా ‘వి’?

సినిమాల పరిస్థితి, మార్కెట్ పరిస్థితి అంతగా బాలేదు. ఇలాంటి టైమ్ లో లోకల్ బాడీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. మరోపక్క కరోనా భయం అంతో ఇంతో తెలుగు నాట కూడా వుంది. ఇవి చాలవన్నట్లు,…

సినిమాల పరిస్థితి, మార్కెట్ పరిస్థితి అంతగా బాలేదు. ఇలాంటి టైమ్ లో లోకల్ బాడీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. మరోపక్క కరోనా భయం అంతో ఇంతో తెలుగు నాట కూడా వుంది. ఇవి చాలవన్నట్లు, పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో ఉగాది సందర్భంగా ఈనెల 25న విడుదల కావాల్సిన వి సినిమా డైలామాలో పడింది.

విడుదల చేయవద్దని, టెన్త్ ఎగ్జామ్స్ తరువాత వదలమని దిల్ రాజు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు వత్తిడి చేయడం ప్రారంభించారు. మరోపక్క ఓవర్ సీస్ బయ్యర్ కూడా ఇప్పుడు వద్దంటున్నారు. అమెరికాలో కరోనా వ్యవహారం కాస్త గట్టిగానే వుంది.

రకరకాల తేదీల్లో ఎన్నికలు వున్నందున, వి సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపిస్తాయని, టెన్త్ పరీక్షలు అయ్యేవరకు ఫ్యామిలీలు థియేటర్ కు రావని బయ్యర్లు వాదిస్తున్నారు. రెండు రోజుల పాటు డిస్కషన్లు నడిచాక, బాల్ ను దిల్ రాజు కోర్టులో వదిలేసారు.

ఇంకా చాలా దూరం టైమ్ వున్నందున ఈ వీకెండ్ లోగా డెసిషన్ తీసుకుంటానని దిల్ రాజు అంటున్నారు.

ఈ నలుగురూ ఏపీ వాణి వినిపించగలరా?

మాట, గౌరవం రెండూ నిలబెట్టుకున్న జగన్