మరోసారి బలిపశువు అవుతున్న వర్ల!

వర్ల రామయ్య తెలుగుదేశం పార్టీ తరఫున నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ.. మీడియాలో హడావిడి చేసే నాయకుడిగా ఉపయోగపడుతూ ఉండవచ్చు గాక.. ఆయనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని అందించడం తప్ప.. తెలుగుదేశం ప్రత్యుపకారంగా…

వర్ల రామయ్య తెలుగుదేశం పార్టీ తరఫున నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ.. మీడియాలో హడావిడి చేసే నాయకుడిగా ఉపయోగపడుతూ ఉండవచ్చు గాక.. ఆయనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని అందించడం తప్ప.. తెలుగుదేశం ప్రత్యుపకారంగా చేసిందేమీ లేదు. ప్రజల్లోంచి స్వయంగా ఓట్లు సాధించి నెగ్గగల సత్తా లేని నాయకుడు అని తెలిసీ రెండుసార్లు ఎన్నికల బరిలోకి దిగి.. దారుణమైన పరాజయాల్ని మూటగట్టుకున్న వ్యక్తి వర్ల రామయ్య. అలాంటి వర్ల రామయ్య.. తెలుగుదేశం పార్టీ కుట్ర, వ్యూహాత్మక రాజకీయాల కోసం మరోసారి బలిపశువు కాబోతున్నారు. రాజ్యసభ ఎంపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు.

ప్రస్తుతం జరుగుతున్న రాజ్యసభ ఎంపీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సీట్లు దక్కనున్నాయి. ఎమ్మెల్యేల కోటాలోనే ఈ నలుగురు ఎంపీలు రాజ్యసభలో అడుగుపెడతారు. ఏపీ అసెంబ్లీలో 85 శాతం ఎమ్మెల్యేల బలంతో ఉన్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ మొత్తం నాలుగింటినీ.. నిర్ద్వంద్వంగా సొంతం చేసుకోవడం ఖరారు. ఆ పార్టీ తరఫున నామినేషన్లు వేసిన నలుగురూ.. అప్పుడే ఎంపీలు అయిపోయినట్లుగా సెలబ్రేషన్ చేసేసుకున్నారు కూడా!

అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్ల రామయ్యను తెరపైకి తెస్తోంది. వర్ల రామయ్యను తమ పార్టీ తరఫున ఎంపీగా పోటీచేయించనున్నట్లు పార్టీ ప్రకటించింది. కేవలం సంఖ్యాపరంగా 22 సీట్లు మాత్రమే కలిగిఉన్న తెలుగుదేశం పార్టీ తలకిందులుగా తపస్సు చేసినా సరే.. ఆ బలంతో ఒక ఎంపీని గెలిపించుకోవడం అనేది అసాధ్యం. అలాంటి నేపథ్యంలో బలిపశువుగా మారడానికే వర్ల రామయ్యను ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది.

ఈ విషయాన్ని ప్రకటించిన చంద్రబాబునాయుడు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి తమ పార్టీ తరఫున చివరిప్రయత్నం వరకు చేస్తామని అంటున్నారు. గెలిచే అవకాశం ఏమాత్రం లేకుండా, తగినంత బలం కూడా లేకుండా… ఎంపీ పోస్టుకు నామినేషన్ వేయడం అంటే.. వైకాపా నుంచి ఓట్లను కొనుగోలు చేయవచ్చుననే ఆశతోనే కదా అన్నది కొందరి అనుమానం. ఇంతోటి ఓడిపోయే ఎన్నికలకు బలిపశువు వర్ల రామయ్య కాగా, పార్టీ ఎమ్మెల్యేలకంతా విప్ జారీచేస్తామని, ప్రతి ఓటును పార్టీ ఏజంటుకు చూపించే వేయాలని, ఉల్లంఘిస్తే అనర్హతకు గురవుతారని కూడా చంద్రబాబు హెచ్చరించడమే కామెడీ.

ఈ నలుగురూ ఏపీ వాణి వినిపించగలరా?

మాట, గౌరవం రెండూ నిలబెట్టుకున్న జగన్