సినిమా విడుదలకు ముందు వీరయ్య కు..వీరసింహాకు ఒకటే పోటీ. ఇట్నుంచి ఓ పోస్టర్ వస్తే అట్నుంచి ఒకటి. ఇటు ఓ అప్ డేట్ అంటే అటు ఇంకోటి.
ఇలా బ్యాలన్స్ చేయలేక నానా బాధ పడ్డారు నిర్మాతలు. పీఆర్ టీమ్. రెండు సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్కటీ బ్యాలన్స్ చేయాల్సి వచ్చింది. ఇటు నుంచి అటు నుంచి మాట పడకుండా ఏదో వాళ్ల బాధ వాళ్లు పడ్డారు. కానీ సినిమాలు విడుదలయ్యాక జనం అస్సలు మొహమాటం లేకుండా ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేసారు.
వీరసింహా ‘నరుకుడు’ రక్తపాతాలు భరించలేకపోయారు. దర్శకుడు గోపీచంద్ మలినేని కథ తప్ప కత్తిసాము మీదే దృష్టి ఎక్కువగా పెట్టేసరికి జనం ..సారీ..బై బై అనేసారు.
మొదటి రోజు ఫ్యాన్స్, సామాజిక వ్యవహారాలు, విరాళాలు పక్కన పెడితే మర్నాటి నుంచి అసలు వైనం బయటపడిపోయింది. మొదటి రోజు తరువాత వీరసింహా డైన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇలాంటి సమయంలో సైలంట్ గా వుండాలి. కానీ ఇప్పటికి పీఆర్ టీమ్ కు బాధ తప్పడం లేదు. వీరయ్య గ్రాస్ ఇన్ని కోట్లు అని పోస్టర్ వేసిన వెంకనే వీరసింహా పోస్టర్ కూడా వేయక తప్పలేదు.
చూస్తుంటే వీరయ్యతో సమానంగా కలెక్షన్లు..చూపించేసి, ఫంక్షన్లు చేసే వరకు నిద్రపోయేలా కనిపించపడం లేదు. బాలయ్యకు చిరుకు ఒకే పీఆర్ టీమ్ అయితేనే వ్యవహారం ఇలా వుంది. అదే వేరు వేరు అయితే ఇంకెంతలా వుంటుందో పోటీ? ఇంతకీ రెండు వందల కోట్ల గ్రాస్..వంద కోట్ల షేర్ పోస్టర్ వస్తుందా? ఏమో వచ్చినా రావచ్చు.