నందమూరి బాలకృష్ణ-శృతి హాసన్-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించిన భారీ చిత్రం వీర సింహ రెడ్డి. ఈ సంక్రాంతికి విడుదల. ఇప్పటికే పాటలు, ట్రయిలర్ ఇతర కంటెంట్ బాగా వైరల్ అయ్యాయి. సినిమా సెన్సారు నిన్న జరిగింది. ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తున్న సెన్సారు టాక్ లు అన్నీ కలిపి ఎనలైజ్ చేస్తే…
వీరసింహారెడ్డి ఒక విధంగా బాలయ్య వీర విహారమే. సినిమాలో ఫుల్ యాక్షన్ సీన్లు పరుచుకున్నాయి. సీనియర్ బాలయ్య క్యారెక్టర్ పవర్ ఫుల్ గా రూపొందింది. ఈ పాత్రలో బాలయ్య నటన ఆకట్టుకుంటుందన్నది సెన్సారు టాక్. అలాగే బాలయ్య పాత్రకు-వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రకు మధ్య వచ్చే సీన్ లు అన్నీ ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.
తొలిసగంలో దాదాపు 20 నిమషాలకు పైగా హై ఇచ్చే సన్నివేశాలు వున్నాయట. మలిసగం మాత్రం పాటలు, ఫైట్లతో కాస్త టైట్ ప్యాక్ అయిందని అంటున్నారు. మూడు పాటలు, ఒక బిట్ సాంగ్, ఫైట్లు అన్నీ సెకండాఫ్ లో రావడం వల్ల ఈ టైట్ ప్యాక్ అన్న టాక్ వినిపిస్తోంది.
పవర్ ఫుల్ డైలాగులు జనాలు పొలిటికల్ గా కనెక్ట్ చేసుకుంటారని, ఈలలు, తప్పట్లు వినిపిస్తాయని అంటున్నారు. మొత్తం మీద సంక్రాంతి బాలయ్య ఓ పవర్ ఫుల్ సినిమా అందిస్తున్నారు అన్నది సెన్సారు టాక్.
Aditya pls share me your number 6302395735
Orey Bali ga enni cinemalu chestavu ra Ade faction movies . movie names ayina marchandi ra . Ade kathi narakatam ade toda gottadam ade dialogues karma ra babu
Endi ra Bali ga endi maaku ee torture