వెనక్కు వచ్చిన టికెట్ రేట్లు

మొత్తానికి ఎర్త్ ఈజ్ రౌండ్ అన్నట్లుంది టాలీవుడ్ టికెట్ ల వ్యవహారం. సినిమా రంగ పెద్దలంతా తమకు వున్న పలుకుబడి ఉపయోగించి తెలంగాణలో ఫ్లెక్సీ రేట్లు తెచ్చారు.  Advertisement తెలంగాణలో ఇలా, ఆంధ్రలో అలా…

మొత్తానికి ఎర్త్ ఈజ్ రౌండ్ అన్నట్లుంది టాలీవుడ్ టికెట్ ల వ్యవహారం. సినిమా రంగ పెద్దలంతా తమకు వున్న పలుకుబడి ఉపయోగించి తెలంగాణలో ఫ్లెక్సీ రేట్లు తెచ్చారు. 

తెలంగాణలో ఇలా, ఆంధ్రలో అలా అంటూ జగన్ ను ట్రోలింగ్ చేసే వారు చేసారు. ఈలోగా ఆంధ్రలో కూడా రేట్లు పెరిగాయి. కానీ కథ అక్కడే అడ్డం తిరిగింది. ఇంతంత రేట్లు అయితే సినిమానే వద్దు అంటూ ప్రేక్షకులు దూరం జరిగారు. దీంతో ఇప్పుడు పరిస్థితి వికటించింది.

ఎఫ్ 3 సినిమాతో మొదలైన టికెట్ ల రేట్ల తగ్గింపు అన్నది ఇప్పుడు థాంక్యూ వరకు వచ్చింది. సింగిల్ థియేటర్ టికెట్ రేటు 100 రూపాయలు ప్లస్ జిఎస్టీ అంటూ ప్రకటించారు. అంటే ఎక్కడ ప్రారంభమయ్యారో అక్కడికే వచ్చారన్నమాట. మిగిలిన నిర్మాతలు కూడా ఇక ఈ దారి పట్టాల్సి వుంటుంది. 

ఓ పక్క ఓటిటికి సినిమాలు ఇవ్వడంలో నిబంధనలు విధిస్తూ ప్రేక్షకుడిని థియేటర్ కు రప్పించడానికి ట్రయ్ చేస్తున్నారు. ఇంకో టికెట్ ల తగ్గింపు మార్గం చూసుకుంటున్నారు.

చూస్తుంటే టాలీవుడ్ జనాల అత్యాశే ఈ పరిస్థితికి కారణంలా కనిపిస్తోంది. మూడు రోజుల్లోనే వీలయినంత మొత్తం లాగేయాలని అనుకన్నారు. అది కాస్తా ఇలా వికటించింది. ప్రభుత్వాల మీద వత్తిడి తెచ్చి, మొహమాట పెట్టి టికెట్ రేట్లు సాధించిన కష్టం వృధాగా పోతోంది మొత్తానికి.