మైల్ స్టోన్ మూవీని ప్రకటించిన వెంకీ

పోటాపోటీగా సినిమాలు చేయడం వెంకటేష్ కు నచ్చదు. కథ మనసుకు నచ్చితే చేస్తాడు, లేదంటే ఎన్నాళ్లయినా గ్యాప్ తీసుకోవడానికి రెడీ. అలా ఎఫ్3 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు వెంకటేష్. మధ్యలో ఓరిదేవుడా లాంటి…

పోటాపోటీగా సినిమాలు చేయడం వెంకటేష్ కు నచ్చదు. కథ మనసుకు నచ్చితే చేస్తాడు, లేదంటే ఎన్నాళ్లయినా గ్యాప్ తీసుకోవడానికి రెడీ. అలా ఎఫ్3 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు వెంకటేష్. మధ్యలో ఓరిదేవుడా లాంటి సినిమా చేసినా అది వెంకీ ఖాతాలోకి రాదు. గెస్ట్ ఎప్పీయరెన్స్ కింద లెక్క.

ఎట్టకేలకు తన కొత్త సినిమా ప్రకటించారు వెంకీ. శైలేష్ కొలను దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు ఓ ప్రత్యేకత ఉంది. వెంకీ కెరీర్ లో 75వ సినిమా ఇది.

హిట్ ఫ్రాంచైజీతో పాపులర్ అయ్యాడు శైలేష్ కొలను. హిట్, హిట్-2 సినిమాలు రెండింటితో హిట్ కొట్టాడు. ఇప్పుడు వెంకటేష్ ను డైరక్ట్ చేయబోతున్నాడు. శైలేష్ కొలను మార్క్ తోనే ఈ సినిమా రాబోతోంది. వెంకటేష్ ను ఇందులో సరికొత్తగా చూపించబోతున్నాడు దర్శకుడు.

నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్ని బుధవారం ప్రకటిస్తారు.