Advertisement

Advertisement


Home > Movies - Movie News

మెగా కాంపౌండ్ లో వెంకటేష్?

మెగా కాంపౌండ్ లో వెంకటేష్?

నారప్ప కాస్త నిరాశపరిచినా దృశ్యం-2 రిజల్ట్ వెంకటేష్ లో ఉత్సాహం నింపింది. ఇదే ఉత్సాహంతో తన నెక్ట్స్ ప్రాజెక్టు కు రెడీ అవుతున్నాడు వెంకీ. ఈ సీనియర్ హీరో చేతిలో ప్రస్తుతం 2-3 కథలున్నాయి. 

వీటిలో ఎప్పట్నుంచో నలుగుతున్న తరుణ్ భాస్కర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. కానీ దాన్ని సెట్స్ పైకి తీసుకురావడం వెంకీకి ఇష్టం లేదు. ఈ గ్యాప్ లో మరో రీమేక్ మూవీ అతడ్ని ఆకర్షించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అందులో వెంకీ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మలయాళంలో సూపర్ హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాలో వెంకటేష్ నటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ పాత్ర ఉంది. ఆ క్యారెక్టర్ వెంకటేష్ కు పెర్ ఫెక్ట్ గా సరిపోతుందంటూ గతంలోనే టాలీవుడ్ లో చర్చ జరిగింది. ఇప్పుడు అదే పాత్రను వెంకీ పోషించే అవకాశం ఉంది.

ఈ సినిమా రైట్స్ మెగా కాంపౌండ్ దగ్గర ఉన్నాయి. ఆచార్య డీలింగ్స్ అన్నీ పూర్తయిన తర్వాత వెంకటేష్ చేయబోయే ప్రాజెక్టుపై మెగా కాంపౌండ్ నుంచి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా రీమేక్ హక్కుల్ని రామ్ చరణ్ దక్కించుకున్నారు, కానీ వాటిని గీతాఆర్ట్స్ బ్యానర్ కు బదిలీ చేసే ఆలోచనలో ఉన్నారట.

ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో హీరో పాత్ర కూడా ఉంది. ఆ క్యారెక్టర్ ను రవితేజతో చేయించబోతున్నారంటూ గతంలోనే చాలా ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతానికి ఆ క్యారెక్టర్ గురించి పెద్దగా ఆలోచన చేయడం లేదు. 

వెంకటేష్ లాక్ అయితే తర్వాత ఇతర విషయాల గురించి ఆలోచించాలని, వెంకీ పూర్తిస్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ప్రాజెక్టును ఇంకొన్నాళ్లు ఆపాలని ప్రాధమికంగా భావిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?