షాకింగ్.. పగిలిన ఫోన్ వాడుతున్న స్టార్ హీరో

స్టార్ హీరోల జీవితాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. లగ్జరీ కార్లు, కాస్ట్ లీ దుస్తులు, వీకెండ్ పార్టీలు.. రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు వాళ్లు. కానీ అందరూ ఇలానే ఉంటారనుకుంటే పొరపాటు. వెంకటేష్…

స్టార్ హీరోల జీవితాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. లగ్జరీ కార్లు, కాస్ట్ లీ దుస్తులు, వీకెండ్ పార్టీలు.. రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు వాళ్లు. కానీ అందరూ ఇలానే ఉంటారనుకుంటే పొరపాటు. వెంకటేష్ లాంటి హీరోలు ఇలాంటి వాటికి అతీతం. సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతాడు వెంకటేష్.

ఆయన ఎంత సింపుల్ గా ఉంటాడనే విషయం తాజాగా మరోసారి బయటపడింది. హీరో రామ్ చరణ్, తన ఇంట్లో కొంతమంది ప్రముఖులకు దీపావళి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి వెంకీ కూడా హాజరయ్యాడు. పార్టీకి సంబంధించిన ఫొటోలు కూడా బయటకొచ్చాయి. వీటిలో ఒక ఫొటోలో వెంకీ తన మొబైల్ ఫోన్ పట్టుకొని పోజులిచ్చాడు.

ఆ మొబైల్ ఫోన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, ఆ మొబైల్ స్క్రీన్ పగిలిన విషయాన్ని నెటిజన్లు గుర్తించారు. పగిలిన స్క్రీన్ తో ఉన్న మొబైల్ ను వెంకటేష్ వాడుతున్నాడని తెలుసుకొని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక్కడే మరో విషయాన్ని కూడా బయటకు తీస్తున్నారు సోషల్ మీడియా జనం.

సెలబ్రిటీలంతా ఐఫోన్లు వాడుతుంటారు. కానీ వెంకీ చేతిలో ఉన్న మొబైల్ మాత్రం ఐఫోన్ కాదు. అది సాధారణ ఆడ్రాయిడ్ ఫోన్. పైగా పగిలిన ఫోన్. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

వెంకీ చేతిలో ఉన్న ఫోన్ నిజంగానే పగిలిందా లేక స్క్రీన్ పై గీతలు పడ్డాయా అనే విషయాన్ని పక్కనపెడితే, అది కచ్చితంగా ఐఫోన్ మాత్రం కాదు. పక్కనే ఉన్న బన్నీ చేతిలో మాత్రం లేటెస్ట్ ఐఫోన్ ధగధగలాడుతోంది.