రాత్రి 2 గంటలకు డాన్స్ చేసిన వెంకీ

రాత్రి 2 గంటలకి ఆ సాంగ్ వింటున్నప్పుడు తెలియకుండానే డ్యాన్స్ చేశాను. ఏదో తెలియని ఎనర్జీ ఆ పాటలో ఉంది.

అప్పుడప్పుడు పాటలు పాడడం వెంకీకి అలవాటే. ఇప్పటికే కొన్ని సినిమాల్లో పాటలు పాడాడు. తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో కూడా ఓ సాంగ్ పాడాడు. అయితే ఇప్పటివరకు పాడిన పాటలు ఒకెత్తు, ‘సంక్రాంతికి వస్తున్నాం’ పాట మరో ఎత్తు అంటున్నారు వెంకీ. ఈ పాట వెనక నడిచిన స్టోరీని ఆయన బయటపెట్టారు.

“రాత్రి 2 గంటలకి ఆ సాంగ్ వింటున్నప్పుడు తెలియకుండానే డ్యాన్స్ చేశాను. ఏదో తెలియని ఎనర్జీ ఆ పాటలో ఉంది. అప్పుడే ఆ పాట పాడాలని డిసైడ్ అయ్యాను. మరుసటి రోజు దర్శకుడి వద్దకెళ్లి నేనే పాడతా అని అడిగాను. ఆ రోజు గొంతు బాగానే వుంది. లిరిక్స్ లో ఇంగ్లిష్ పదాలు కూడా ఉండడంతో నాకు పాడడం మరింత ఈజీ అయిపోయింది.”

ఇలా తను పాట పాడడం వెనక కథను బయటపెట్టారు వెంకీ. చాలా తక్కువగా తను పాటలు హమ్ చేస్తుంటానని, ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో సంక్రాంతి సాంగ్ ను తను రెగ్యులర్ గా హమ్ చేస్తున్నానని వెల్లడించారు.

ఈ పాట విడుదలకు ముందు ప్రమోషన్ కోసం అనీల్ రావిపూడి ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో వెంకటేశ్, అనీల్ ను డిస్టర్బ్ చేస్తుంటారు. ‘నేను పాడతా..నేను పాడతా’ అంటూ వెంటపడతారు. అది సరదాగా అనిపించినప్పటికీ, రియల్ లైఫ్ లో అదే జరిగిందంటున్నారు వెంకటేష్.

3 Replies to “రాత్రి 2 గంటలకు డాన్స్ చేసిన వెంకీ”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

Comments are closed.