2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. 2009లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న పోరాటాలు మరింతగా ఊపందుకున్నాయి. ఆ పోరాటాల్ని అడ్డుకునే వారు కాంగ్రెసు పార్టీలో లేకుండాపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటిదాకా రాష్ట్ర విభజన ప్రయత్నాలను ఆపుతూ వచ్చారనే ప్రచారం బాగా ఉండేది. అయితే.. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక సరికొత్త సంగతి బయటపెడుతున్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నా సరే రాష్ట్ర విభజన ఆగేది కాదని ఆయన అంటున్నారు. 2009 ఎన్నికలకు పూర్వమే విభజన గురించి అధిష్ఠానం నుంచి ప్రతిపాదన వచ్చిందనే సంగతిని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గుర్తు చేస్తున్నారు.
తాజాగా విజయవాడలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ఆత్మీయ కలయికలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పలు విషయాలను వెల్లడించడం విశేషం. ఇప్పటి రాజకీయాల తీరుతెన్నుల మీద నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైరాగ్య భావనను ప్రకటించారు. దేశంలో అవినీతి పెరిగిపోయింది. ఎన్నికలంటే భయం వేస్తోంది.
రానున్న రోజుల్లో ఎన్నికల్లో పోటీచేయలేం అంటూ ఆయన అనడం విశేషం. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో నల్లారి రాజంపేట నియోజకవర్గం నుంచి భాజపా తరఫున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. నాయకులు అధికారులు కలిసి పంపకాలు చేసుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చివరిసారిగా ప్రయాణించిన హెలికాప్టర్లో తాను కూడా వెళ్లవలసి ఉన్నదని, చివరి నిమిషంలో తన పర్యటన రద్దయిందని అప్పటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
ఇదే కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. తనదైన శైలిలో ఆయన కూడా వైరాగ్యాన్ని ప్రకటించడం విశేషం. ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని భావిస్తున్నారు.. అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి భావన సరికాదు. మేము రాజకీయాల్లో ఉన్నది దోచుకోవడానికి కాదు.. కానీ, దోపిడీలో భాగస్వామ్యం కావాల్సిన పరిస్థితులు వచ్చాయి. నేడు పరిస్థితులు చూస్తోంటే బాధగా ఉంది.. అని ఆయన అంటున్నారు.
మండలి బుద్ధప్రసాద్ ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తే. ఆయనే స్వయంగా.. తమకు ఇష్టం లేకపోయినా సరే దోపిడీలో భాగస్వామ్యం కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే దాని అర్థం ఏమిటి? ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం విచ్చలవిడిగా దోచుకుంటున్నట్టే కదా అని ప్రజలు భావిస్తున్నారు. ఈ ఇద్దరు నాయకుల మాటలు కూడా ఇప్పటి ప్రభుత్వాల దోపిడీని ప్రస్తావిస్తున్నాయి. ఇటు రాష్ట్రంలోను, అటు కేంద్రంలోనూ కూడా ఆ నాయకులకు చెందిన పార్టీలే పాలనలో ఉండడం విశేషం.
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు
అలాంటప్పుడు అసెంబ్లీలో తీర్మానం, చివరి బంతి అంటూ జనాలను తప్పుదారి పట్టించారెందుకు లాస్ట్ బాల్ సీఎం గారూ!
అలాంటప్పుడు అసెంబ్లీలో తీర్మానం, చివరి బంతి అంటూ జనాలను తప్పుదారి పట్టించారెందుకు లాస్ట్ బాల్ సీఎం గారూ!