మరో రెండు రోజుల్లో విడుదలవుతోంది చారి 111. వెన్నెల కిషోర్ హీరో. నిజానికి వెన్నెల కిషోర్ హీరోగా అంటే కాస్త ఆశ్చర్యమే. ఎందుకుంటే గతంలో చాలా సార్లు వెన్నెల కిషోర్. మరీ వైవిధ్యమైన పాత్ర అయితే తప్ప, హీరో గా సినిమా చేయనని, కీలక పాత్ర వరకు ఓకె అని క్లారిటీగా చెప్పాడు.
తన ముందు కమెడియన్ల హీరో జర్నీ చూసి ఇలాంటి నిర్ణయానికి వచ్చి వుండొచ్చు. ఏమైతేనే కమెడియన్ గా మాత్రం ఫుల్ బిజీ. వన్ డే కూడా ఖాళీ లేదు డైరీ. ఇలాంటి టైమ్ లో హీరో చారి 111 సినిమా అనేసరికి కాస్త ఆశ్చర్యం. కానీ ఈ సినిమా వెనుక అసలు కథ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
ఈ సినిమాను ముందుగా నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ గా అనుకున్నారట. అలా అని చెబితేనే వెన్నెల కిషోర్ ఓకె అన్నాడట. థియేటర్ సినిమా, అది కూడా హీరో అంటే తాను చేయనని అప్పుడే చెప్పాడట. ఇది వెబ్ సిరీస్ అని, మెయిన్ లీడ్ లు ఇద్దరు ముగ్గురు వుంటారని, సినిమా మొత్తం కిషోర్ మీదే వెళ్లదని, మురళీశర్మ కూడా కీలకపాత్ర చేస్తున్నారని చెప్పి ఒప్పించారట.
వెబ్ సిరీస్ మోడ్ లోనే తీసారట. చాలా చోట్ల ఇంగ్లీష్ డైలాగులు వగైరా పెట్టి. తీరా చేసి వున్నట్లుండి సినిమా అని చెప్పి, థియేటర్ విడుదల అనౌన్స్ చేసే సరికి వెన్నెల కిషోర్ షాక్. అదేంటీ అని అడిగితే, థియేటర్ విడుదల చేస్తే తప్ప తీసుకోము అని చెప్పారని, అందువల్ల తప్పని సరై థియేటర్ లో విడుదల చేస్తున్నామని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారట.
కానీ తాను ప్రచారానికి రాలేనని, ముందుగానే తన డేట్ లు అన్నీ ఇచ్చేసానని వెన్నెల కిషోర్ చెప్పేసాడట. ఇప్పుడు ప్రచారానికి కిషోర్ రావడం లేదన్న ప్రచారం పెరిగింది. దాంతో కిషోర్ సన్నిహితులు మొత్తం కథ చెప్పి, క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది.