షాకింగ్.. మళ్లీ లీకుల బారిన పడిన ప్రభాస్ సినిమా

ప్రభాస్, దీపిక పదుకోన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ ఇప్పటికే విడుదలైంది. దీపిక లుక్ కూడా వచ్చింది. అయితే అది క్లోజప్ మాత్రమే. మరి దీపిక క్యారెక్టర్,…

ప్రభాస్, దీపిక పదుకోన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కల్కి. ఈ సినిమా నుంచి ప్రభాస్ లుక్ ఇప్పటికే విడుదలైంది. దీపిక లుక్ కూడా వచ్చింది. అయితే అది క్లోజప్ మాత్రమే. మరి దీపిక క్యారెక్టర్, ఆమె దుస్తులు, లుక్ ఎలా ఉంటుంది? దీనికి ఈరోజు సమాధానం దొరికింది.

ఊహించని విధంగా కల్కి సినిమా నుంచి ఈరోజు ఓ వీడియో లీక్ అయింది. అందులో దీపిక పదుకోన్, తన సహ-నటితో మాట్లాడుతున్న సన్నివేశం ఉంది. ఆ వీడియో ఇలా లీక్ అయిన వెంటనే అలా వైరల్ అయింది. దీంతో యూనిట్ అవాక్కయింది.

కల్కి సినిమా లీకులపై ఇప్పటికే వైజయంతీ మూవీస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ నెలలో లీక్ అయిన స్టిల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా లీగల్ గా పబ్లిక్ నోటీసు జారీ చేసింది. తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

అయినప్పటికీ ఈరోజు ఏకంగా కల్కి సినిమా నుంచి వీడియో లీక్ అవ్వడం ఆందోళనలు రేకెత్తిస్తోంది. కంటెంట్ లీక్ అయిందని తెలిసిన వెంటనే కల్కి డిజిటల్ టీమ్ రంగంలోకి దిగింది. సోషల్ మీడియా నుంచి ఆ క్లిప్పుల్ని తొలిగించింది. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎవ్వరూ లీక్ అయిన క్లిప్స్ ను ఫార్వార్డ్ చేయడం లేదు.

జరిగిన ఘటనపై వైజయంతీ మూవీస్ సీరియస్ గా ఉంది. గ్రాఫిక్స్ డిపార్ట్ మెంట్ నుంచే ఈ క్లిప్ లీక్ అయినట్టు కొంతమంది చెబుతున్నప్పటికీ, పూర్తిస్థాయిలో నిజనిర్థారణ చేయాలని యూనిట్ భావిస్తోంది. ఆదిలోనే ఇలాంటి లీకుల్ని అరికట్టకపోతే, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే విషయం నిర్మాతలకు తెలుసు.