బాలీవుడ్ నటి విద్యాబాలన్ సూటి ప్రశ్న ఇది. లింగ వివక్ష ఇక్కడ్నుంచే మొదలవుతుందని అంటోందామె. తనను చాలామంది ఈ ప్రశ్న అడిగారని, అలా అడిగినప్పుడు తనకు చిర్రెత్తుకొచ్చేదని చెప్పుకొచ్చింది.
“నాకు ఇప్పటికీ గుర్తు. డిన్నర్ టైమ్ లో చాలామంది నాకు వంట చేయడం రాదు అనేవారు. తప్పనిసరిగా వంట నేర్చుకోమని చెప్పేవారు. సిద్దార్థ్ (భర్త)కు కూడా వంట రాదని నేను చెప్పేదాన్ని. కానీ వాళ్లు ఒప్పుకునే వాళ్లు కాదు. నువ్వు వంట నేర్చుకోవాలి అనేవారు.”
ఇప్పటికీ మహిళల్నే ఎందుకు ఇలా ప్రశ్నిస్తారో తనకు అర్థంకాదంటోంది విద్యాబాలన్. వంట చేసే విషయంలో తన భర్త కంటే తననే ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడుగుతోంది.
“నాకు తెలిసి అందరం లింగ వివక్ష ఎదుర్కొనే ఉంటాం. కేవలం ఆపోజిట్ సెక్స్ నుంచి మాత్రమే కాదు, ఓ మహిళను మరో మహిళ ప్రశ్నించడం చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. లాక్ డౌన్ టైమ్ లో నేను వంట ప్రయత్నించాను. కానీ పూర్తిగా చేయలేదు. నా స్టాఫ్ కు సహకరించానంతే.”
తన ఇంట్లో కూడా వంట నేర్చుకోమని పెద్దలు పోరు పెట్టేవారని, కానీ డబ్బు సంపాదిస్తున్న తను వంట మనిషిని పెట్టుకుంటానని లేదంటే వంట తెలిసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని సమాధానం ఇచ్చినట్టు గుర్తుచేసుకుంది విద్యాబాలన్.