విజయ్-105 కోట్లు..ప్లస్ జీఎస్టీ

పండగ వేళకు మూడు సినిమాలు పోటా పోటీ గా వస్తున్నాయి. అంకెల ప్రకారం చూసుకుంటే ఈ మూడు సినిమాల్లో తమిళ హీరో విజయ్ సినిమానే భారీ సినిమా. హీరో రెమ్యూనిరేషన్, బడ్జెట్, ఇలా ఎలా…

పండగ వేళకు మూడు సినిమాలు పోటా పోటీ గా వస్తున్నాయి. అంకెల ప్రకారం చూసుకుంటే ఈ మూడు సినిమాల్లో తమిళ హీరో విజయ్ సినిమానే భారీ సినిమా. హీరో రెమ్యూనిరేషన్, బడ్జెట్, ఇలా ఎలా చూసుకున్నా వారసుడే పెద్ద సినిమా. 

వారసుడు సినిమా కోసం హీరో విజయ్ కు 105 కోట్ల రెమ్యూనిరేషన్ ప్లస్ జీఎస్టీ కూడా చెల్లించినట్లు తెలుస్తోంది. ఇదే సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి కి 15 కోట్లు రెమ్యూనిరేషన్ ఇచ్చారు. ఇంకా వీరు కాక రష్మిక, కాస్ట్ అండ్ క్రూ వుండనే వున్నారు. సినిమా ప్రొడక్షన్ కు 100 కోట్ల వరకు అయింది. అంటే టోటల్ గా 250 కోట్ల బడ్జెట్ సినిమా వారసుడు.

కానీ మన స్ట్రయిట్ సినిమాల సంగతి వేరు. బాలయ్య రెమ్యూనిరేషన్ 12 కోట్లు. అఖండ కు ముందు ఎనిమిది కోట్లే. తరువాత 12 చేసారని తెలుస్తోంది. మెగాస్టార్ రెమ్యూనిరేషన్ 35 కోట్లు అని టాక్ వుంది. ఈ సినిమాల బడ్జెట్ లు అంతా కలిపి ఒక్కోటీ నూరు నుంచి నూట ఇరవై కోట్ల బడ్జెట్ వుంటుంది.

సంక్రాంతికి వచ్చే మూడు సినిమాలు టేబుల్ ప్రాఫిట్ సినిమాలే. ఆ ప్రాఫిట్ సింగిల్ డిజిట్ లో వుంటుందా? డబుల్ డిజిట్ లో వుంటుందా అన్నది తరువాత సంగతి. టొటల్ టర్నోవర్ ల సంగతి అలా వుంచితే కేవలం థియేటర్ల మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి బాలయ్య, చిరు సినిమాలు దాదాపు రెండు వందల యాభై కోట్ల గ్రాస్ వసూళ్లు కనీసం సాధించాలి. విజయ్ సినిమా కు తెలుగు నాట పెద్ద టార్గెట్ లు వుండవు. కానీ తమిళంలో, వరల్డ్ వైడ్ గా టార్గెట్ లు పెద్దవిగా వుంటాయి.