బతుకుపై బెంగలేదు.. విజయ్ ఫిలాసఫీ

కేవలం సినిమాలే కాకుండా ఒక్కోసారి తనలోని భావుకతను, తాత్వికతను కూడా బయటపెడుతుంటాడు హీరో విజయ్ దేవరకొండ. తనను హీరోగా చూడొద్దంటున్న ఈ నటుడు, తన మనసుకు నచ్చిన పని చేస్తున్నానని, ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి…

కేవలం సినిమాలే కాకుండా ఒక్కోసారి తనలోని భావుకతను, తాత్వికతను కూడా బయటపెడుతుంటాడు హీరో విజయ్ దేవరకొండ. తనను హీరోగా చూడొద్దంటున్న ఈ నటుడు, తన మనసుకు నచ్చిన పని చేస్తున్నానని, ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి ఉండిపోవాలని అనుకోవలం లేదని స్పష్టం చేశాడు.

“ఇండస్ట్రీలో నా సేఫ్టీ గురించి పెద్దగా ఆలోచించను. ఏదైనా జరిగితే పొగొట్టుకుంటాననే భయం నాకు లేదు. ఎందుకంటే పోగొట్టుకోవడానికి నా దగ్గరేం లేదు. ప్రస్తుతం నేను బతకడానికి కావాల్సినంత డబ్బు ఉంది. నా అద్దెలు నేను కట్టుకుంటాను. గడిచిన పాతికేళ్లు నేను ఎలా బతికానో, అలాంటి సింపుల్ లైఫ్ ను మరో 60 ఏళ్లు బతికేంత డబ్బు నా దగ్గరుంది.”

ఫ్యాన్ బేస్, స్టార్ డమ్, రెమ్యూనరేషన్ గురించి ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు విజయ్. ఫ్యాన్స్ ను తను పోగొట్టుకున్నా సంపాదించుకుంటానని.. ఇక స్టార్ డమ్ అనే పదాన్ని అస్సలు పట్టించుకోనని అంటున్నాడు. తన జీవితంలో అతి తక్కువ ప్రాధాన్యత డబ్బుకే ఇస్తానంటున్నాడు.

“నేను ఎలాగైనా బతికేస్తాను. ఆ విషయం నాకు తెలుసు. నేను ఎవరో కూడా ఎవరికీ తెలియని స్థితి నుంచి ఈ పొజిషన్ కు వచ్చాను. ఇప్పుడు నాకో ఫ్యాన్ బేస్ ఉంది. నా రౌడీస్ ను నేను కోల్పోవచ్చు. కానీ నేను వాళ్లను (ఫ్యాన్స్) తిరిగి సంపాదించుకోగలననే నమ్మకం నాకు ఉంది. అందుకే ఎక్కువ సేఫ్టీ గురించి ఆలోచించను.”

తనను ఉత్తేజపరిచేంత వరకు సినిమాలు చేస్తానంటున్నాడు విజయ్ దేవరకొండ. ఎప్పుడైతే తనకు సినిమా బోర్ కొట్టి, మరో అంశం బాగా నచ్చుతుందో ఆ క్షణమే సినిమాల నుంచి తప్పుకుంటానంటున్నాడు. లైఫ్ లో బోర్ కొడితే తట్టుకోలేనంటున్నాడు.

“నటించడంలో మజా వస్తోంది. నన్ను ఉత్తేజపరిచే కథల్ని నేను ఎంచుకుంటున్నాను. ఇంతకంటే ఎగ్జయిట్ అయ్యేది కనిపిస్తే కచ్చితంగా సినిమాల నుంచి తప్పుకుంటాను. యాక్టింగ్ కంటే మజా వచ్చేది ఇంకేదైనా కనిపిస్తే, ఆ రోజు నుంచే యాక్టింగ్ ఆపేస్తాను. ఎందుకంటే ముందే చెప్పినట్టు బతకడం గురించి నాకు బెంగ లేదు.”

ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా తనలోని తాత్వికుడ్ని బయటపెట్టాడు విజయ్ దేవరకొండ. అతడు నటించిన డియర్ కామ్రేడ్ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. సినిమాలోని తన పాత్రలో కూడా ఓ తాత్వికుడు కనిపిస్తాడని చెబుతున్నాడు విజయ్.

ఫిల్మ్ నగర్ అయిపోయే.. ఇప్పుడు వయా ముంబై

ఎవరిది పిచ్చోడి చేతిలో రాయి పాలన అవుతుంది!