ఆ చెయ్యి ఎవరిది విజయ్ దేవరకొండా..?

విజయ్ దేవరకొండపై పుకార్లు కొత్త కాదు. హీరోయిన్ రష్మికతో అతడి రిలేషన్ షిప్ పై ఇప్పటికే బోలెడన్ని ఊహాగానాలు, కథనాలు వచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు విజయ్ దేవరకొండ ఖండిస్తూ వచ్చాడు కూడా. అయితే తన…

విజయ్ దేవరకొండపై పుకార్లు కొత్త కాదు. హీరోయిన్ రష్మికతో అతడి రిలేషన్ షిప్ పై ఇప్పటికే బోలెడన్ని ఊహాగానాలు, కథనాలు వచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు విజయ్ దేవరకొండ ఖండిస్తూ వచ్చాడు కూడా. అయితే తన పర్సనల్ లైఫ్ పై, లవ్ లైఫ్ పై విజయ్ దేవరకొండ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈసారి చేసినట్టు కనిపిస్తోంది.

కొద్దిసేపటి కిందట ఓ పోస్ట్ పెట్టాడు విజయ్ దేవరకొండ. “చాలా జరుగుతోంది కానీ ఇది మాత్రం నిజంగా చాలా ప్రత్యేకం – త్వరలోనే ప్రకటిస్తా” అంటూ పోస్టు పెట్టాడు విజయ్. ఈ సందర్భంగా ఈ నటుడు పెట్టిన ఫొటో క్యూరియాసిటీ పెంచుతోంది. ఓ అమ్మాయి చేతిలో చేయి వేసి, విజయ్ దేవరకొండ దిగిన పిక్ ఇది.

పెళ్లికి రెడీ అయ్యాడా..?

సహజంగా లవ్ మేటర్ బయటపెట్టాల్సి వచ్చినప్పుడు, నిశ్చితార్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తుంటారు నటీనటులు. విజయ్ దేవరకొండ కూడా అదే ఉద్దేశంతో ఈ ఫొటో పెట్టి ఉంటాడని చాలామంది అనుకుంటున్నారు. రీసెంట్ గా తన పెళ్లిపై పలుమార్లు స్పందించాడు విజయ్ దేవరకొండ. తనకు తెలిసిన చాలామంది పెళ్లిళ్లు చేసుకున్నారని, వాళ్లంతా హ్యాపీగా ఉన్నారని అన్నాడు. తనకు కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలని ఉందంటూ ఓపెన్ అయ్యాడు.

ఇంతకీ ఆ చేయి ఎవరిది..?

సో.. తన పెళ్లి మేటర్ ను విజయ్ దేవరకొండ ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని చాలామంది చెప్పుకుంటున్నారు. అంతా ఓకే కానీ, ఆ చేయి ఎవరిదనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్. విజయ్-రష్మిక రిలేషన్ షిప్ ను దృష్టిలో పెట్టుకొని, చాలామంది అది రష్మిక చేయి అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరికొందరు మాత్రం విజయ్, మరో అమ్మాయిని పరిచయం చేసి షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు.

ప్రమోషనల్ స్టంట్..

ఈ మొత్తం వ్యవహారానికి మరో కోణం జోడిస్తున్నారు కొంతమంది. విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రచారం కోసమే, ఈ హీరో ఇలా పోస్ట్ పెట్టి ఉంటాడని కొందరు భావిస్తున్నారు. అది కచ్చితంగా సమంత అరచేయి అయి ఉంటుందని అంటున్నారు. మరికొందరు మాత్రం విజయ్ దేవరకొండ ఇలాంటి ప్రచారాలు చేయడని చెబుతున్నారు.

ఏదేమైనా ఈ ఒక్క ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పైగా “చాలా జరుగుతోంది.. త్వరలోనే చెబుతా” అంటూ విజయ్ దేవరకొండ చెప్పడంతో అది కచ్చితంగా ఖుషికి సంబంధించింది కాదని, అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మేటర్ అయి ఉంటుందని అంటున్నారు.