విజయ్ కు జిమ్ సమస్య

పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఫైటర్. ఈ సినిమాను బాలీవుడ్ లో తీస్తూ, తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. మామూలుగా అయితే పూరి జగన్నాథ్ ఇలా సినిమా స్టార్ట్ చేసి,…

పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ఫైటర్. ఈ సినిమాను బాలీవుడ్ లో తీస్తూ, తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. మామూలుగా అయితే పూరి జగన్నాథ్ ఇలా సినిమా స్టార్ట్ చేసి, అలా తీసి పక్కన పెడతారు. కానీ ఆయన కెరీర్ లోనే కాస్త ఎక్కువ కాలం షూటింగ్ చేసే సినిమాగా ఫైటర్ వుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. 

ఇలాంటి టైమ్ లో ఈ సినిమాకు మరింత టైమ్ పట్టేలా కనిపిస్తోంది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ సంగతి అలా వుంచితే, ఫైటర్ క్యారెక్టర్ కు అనుగుణంగా శరీర ధారుఢ్యాన్ని మలుచుకువాల్సి వుందట. అందుకు విజయ్ విపరీతంగా జిమ్ లో శ్రమించాల్సి వుందట. 

కానీ కరోనా కారణంగా ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా వాయిదా పడిపోయిందట. జిమ్ లు అన్నీ మూత పడ్డాయి. విజయ్ కు చాలా మంది హీరోల మాదిరిగా ఇంట్లో జిమ్ లేదు. దాంతో విజయ్ ఫిట్ నెస్ ను కరెక్ట్ చేసుకుని, క్యారెక్టర్ కు అనుగుణంగా చేయడం కుదరడం లేదట. అందువల్ల ఫైటర్ సినిమా అనుకున్నదాని కన్నా కొంచెం ఎక్కువ ఆలస్యమే అయ్యే అవకాశం వుంది.

బాలీవుడ్ కోసమే

ఇదిలా వుంటే ఈ గ్యాప్ లో పూరి ఒక మాంచి స్టోరీ తయారుచేస్తున్నారని వార్త వచ్చింది. దాంతో ఈ కథ మెగాహీరోల కోసమే అంటూ హడావుడి స్టార్ట్ అయింది. అయితే విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం పూరి తన తరువా త సినిమా కూడా బాలీవుడ్ లోనే చేయబోతున్నారట. బాలీవుడ్ లో యంగ్ టాప్ హీరోలను దృష్టిలో పెట్టుకుని ఈ కథ తయారుచేస్తున్నారని తెలుస్తోంది. బాలవుడ్ భాగస్వామ్యంతో అక్కడే ఈ కథను, టాప్ యంగ్ హీరోల్లో ఒకరితో తెరకెక్కిస్తారని బోగట్టా. 

'విశ్వక్' మూవీకి నాకు సంబంధం..?