తమిళ సూపర్ స్టార్ కు మాంచి క్రేజ్ వుందన్న సంగతి తెలిసిందే. డిజిటల్ రైట్స్, నాన్ థియేటర్ రైట్స్, ఓవర్ సీస్ రైట్స్, ఇంకా ఇంకా ఇలా చాలా విధాలుగా మాంచి మార్కెట్ వుంది. అందుకే అతగాడి రెమ్యూనిరేషన్ కూడా అదే రేంజ్ లో వుంటుంది. ప్రస్తుతం విజయ్ రెమ్యూనిరేషన్ 80 కోట్ల రేంజ్ లో వుందని తెలుస్తోంది.
అయితే నిర్మాత దిల్ రాజు దీనికి మించి ఆఫర్ చేసి డేట్ లు పట్టేసారు అని టాలీవుడ్ లో వినిపిస్తోంది. విజయ్ నేరుగా చేసే తొలి తెలుగు సినిమా ఇది. నిజానికి ఇప్పటి వరకు విజయ్ చేసిన ప్రతి సినిమా తెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా తమిళంలోనే తీస్తారు, కాకపోతే డబ్బింగ్ కాకుండా రెండు స్క్రిప్ట్ లు తయారుచేసి, షూట్ చేస్తారు.
విజయ్ కే 80 నుంచి 90 కోట్లు రెమ్యూనిరేషన ఇవ్వడం అంటే సినిమా టోటల్ బడ్జెట్ 160 కోట్లు దాటేయడం ఖాయం. ఎందుకంటే తన సినిమా అంటే దానికి ఓ రేంజ్ వుండేలా చూసుకుంటాడు విజయ్.
చిత్రీకరణ, నటీనటులు అంతా ఓ స్థాయిలో వుండాలి. పైగా ఈ సినిమాకు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ మంచి హిట్ లు అనిపించుకున్నాయి కానీ కాస్ట్ ఫెయిల్యూర్ లే.
ఊపిరి, మహర్షి సినిమాల వల్ల నిర్మాతలకు ఉపయోగం లేకపోయింది. మరి విజయ్, వంశీ పైడిపల్లి కలిసి ఈ సినిమాకు ఏం రేంజ్ లో ఖర్చు చేయిస్తారో? నిర్మాత దిల్ రాజు ఏ మేరకు మిగులుస్తారో చూడాలి.