ప్రస్తుతం ఇండియన్-2 సినిమా చేస్తున్నాడు దర్శకుడు శంకర్. మరోవైపు ఈ సినిమాతో పాటు చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ మూవీ కూడా చేస్తున్నాడు. వీటిలో ఇండియన్-2 షూట్ దాదాపు పూర్తయింది. అటు గేమ్ ఛేంజర్ కూడా 70శాతం కంప్లీట్ అయింది. మరి ఈ రెండు సినిమాల తర్వాత శంకర్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి?
తాజా సమాచారం ప్రకారం.. తన నెక్ట్స్ మూవీని విజయ్ తో ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు శంకర్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే, విజయ్ తో ఓ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీని డిజైన్ చేస్తున్నాడు ఈ డైరక్టర్. ఈ అంశమే ఇప్పుడు చాలామందిని ఆకర్షిస్తోంది.
విజయ్ పొలిటికల్ ఎంట్రీ..?
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన విజయ్, తమిళ రాజకీయాయాల్లోకి వస్తాడనే ప్రచారం చాన్నాళ్లుగా నడుస్తోంది. వాటిని బలం చేకూర్చేలా ఉన్నాయి విజయ్ చర్యలు కూడా. ఆమధ్య పదో తరగతి పాసైన విద్యార్థులకు మెడల్స్, నగదు బహుమతులు అందించాడు. ఇప్పుడు ఏకంగా పాదయాత్ర ప్రారంభించబోతున్నాడనే ప్రచారం కూడా నడుస్తోంది.
లియో సినిమా పూర్తిచేసిన విజయ్, ఆ సినిమా థియేటర్లలోకి రాకముందే తన పాదయాత్రను ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు చాలామంది. దీనికి కొనసాగింపుగానే, లియో తర్వాత శంకర్ దర్శకత్వంలో అతడు పొలిటికల్ మూవీ చేసే ఛాన్స్ ఉందంటూ కోలీవుడ్ నుంచి కథనాలు వినిపిస్తున్నాయి.