విజయ్ న్యూమరాలజీ సెంటిమెంట్?

ఎంత వారికైనా టైమ్ కాస్త తేడా వస్తే, జాతకాలు, వాస్తు, న్యూమరాలజీ ఇలాంటివి అన్నీ గుర్తుకు వస్తాయి. అది కామన్. టాలీవుడ్ లో మరీ కామన్. హీరో విజయ్ దేవరకొండ ను కూడా ఇదే…

ఎంత వారికైనా టైమ్ కాస్త తేడా వస్తే, జాతకాలు, వాస్తు, న్యూమరాలజీ ఇలాంటివి అన్నీ గుర్తుకు వస్తాయి. అది కామన్. టాలీవుడ్ లో మరీ కామన్. హీరో విజయ్ దేవరకొండ ను కూడా ఇదే బగ్ కుట్టినట్లుంది. విజయ్ దేవర కొండ కాస్తా, దేవరకొండ విజయ్ సాయి గా మారాడు. వరస పరాజయాలతో సఫర్ అవుతున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' టీజర్ బయటకు వచ్చింది.

ఈ టీజర్ ఎలా వుంది అన్న సంగతి అలా వుంచితే, టైటిల్ కార్డ్స్ లో దేవరకొండ విజయ్ సాయి అని పేరు వేయడం విశేషం. బహుశా ఇదే విజయ్ అసలు పేరు కూడా అయి వుండొచ్చు. లేదా న్యూమరాలజీ ప్రకారం లేదా మరేదైనా సెంటిమెంట్ ప్రకారం మార్చుకుని వుండొచ్చు.

ఇదిలా వుంటే నీరు, నిప్పు, గాలి, భూమి అనే ఫొర్ ఎలిమెంట్స్ ప్రకారం నాలుగు లవ్ స్టోరీలను దర్శకుడు క్రాంతిమాధవ్ డిజైన్ చేసి, వరల్డ్ ఫేమస్ లవర్ స్టోరీ తయారుచేసినట్లు అనిపిస్తోంది. అయితే హీరో క్యారెక్టర్లలో వేరియేషన్ తో పాటు హీరోయిన్ల క్యారెక్టర్లను కూడా డిఫరెంట్ గా ఈ కాన్సెప్ట్ ప్రకారం డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది.

అయితే అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాల ప్రభావం నుంచి విజయ్ దేవరకొండ బయటకు రాలేకపోతున్నాడని టీజర్ చెబుతోంది. ట్రయిలర్ వస్తే ఈ విషయంలో మరింత క్లారిటీ వస్తుంది.