తన అభిమానులతో (రౌడీస్) రెగ్యులర్ గా టచ్ లో ఉండడానికి రకరకాల పనులు చేస్తుంటాడు విజయ్ దేవరకొండ. తను వెళ్లే కార్యక్రమాలకు కొంతమంది ఫ్యాన్స్ ను తీసుకెళ్తుంటాడు. పుట్టినరోజు వస్తే చాలు ఐస్ క్రీమ్స్ పంచిపెడుతుంటాడు. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది కాబట్టి శాంటాగా కూడా మారబోతున్నాడు.
అవును.. ఈ క్రిస్మస్ కు తను శాంటాగా మారబోతున్నట్టు ప్రకటించాడు విజయ్ దేవరకొండ. అయితే తనకు నచ్చిన బహుమతులు ఇచ్చి అభిమానుల్ని ఆశ్చర్యపరిచే కంటే.. వాళ్లకు నచ్చిన బహుమతుల్నే వాళ్లకిచ్చి తృప్తిపరచాలని భావించాడు. అందుకే “దేవరశాంటా” అనే హ్యాష్ ట్యాగ్ తో ఏం కావాలో చెప్పండంటూ ప్రకటన ఇచ్చేశాడు.
తనకొచ్చిన కోరికల చిట్టా నుంచి మంచివి కొన్ని సెలక్ట్ చేసి క్రిస్మస్ కానుకగా వాళ్లకు పంపిస్తానంటున్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ఈ కార్యక్రమాన్ని కాస్త లేట్ గా ప్రారంభించినప్పటికీ రెస్పాన్స్ మాత్రం బాగానే వస్తోంది. అభిమానులు తమకేం కావాలో స్క్రీన్ షాట్స్ పెట్టి మరీ దేవరకొండను అడుగుతున్నారు.
ఎక్కువమంది మాత్రం తమకు బహుమతులు అక్కర్లేదని, ఒక్క కాల్ చేస్తే చాలని అంటున్నారు. మరికొంతమంది మాత్రం సామాజిక కార్యక్రమాలు చేయాలని కోరుతున్నారు. చాలామంది బ్రాండెడ్ గిఫ్ట్స్ అడుగుతున్నారు. వీళ్లలో ఎంతమంది కోరికల్ని విజయ్ దేవరకొండ తీరుస్తాడో చూడాలి. రెండేళ్ల నుంచి ఈ పద్ధతి ఫాలో అవుతున్న దేవరకొండ, ఈసారి దీన్ని కొత్తపుంతలు తొక్కించాడు