మెగాస్టార్ లేటెస్ట్ మూవీ భోళాశంకర్. ఈ సినిమా ట్రయిలర్ ఫంక్షన్ విజయవాడలో జరగబోతోంది. అయితే ఈ ఫంక్షన్ మెగాస్టార్ వెళ్లరు కానీ టోటల్ టీమ్ అటెండ్ అవుతుంది. ఈ మధ్యన సినిమా ట్రయిలర్లు థియేటర్లలో విడుదల చేసి, ఫ్యాన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే భోళా శంకర్ ట్రయిలర్ ను విజయవాడలో ఈ నెల 27న విడుదల చేస్తారు.
28న పవన్ కళ్యాణ్ బ్రో సినిమా విడుదలవుతోంది. దాంతో మెగాస్టార్ ట్రయిలర్ ను జతచేసేందుకు వీలుగా ముందు రోజు విడుదల చేస్తున్నారు.
తమిళ సినిమా ఆధారంగా తయారవుతున్న ఈ సినిమాలో సుశాంత్, కీర్తి సురేష్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వరసాగర్ అందించిన పాటల్లో రెండు పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. మెగాస్టార్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఫ్యామిలీ సెంటిమెంట్ కు యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ మిక్స్ చేసి ఇటు ఫ్యాన్స్ కు అటు ఫ్యామిలీ ఆడియన్స్ కు సెట్ అయ్యేలా ఈ సినిమా స్క్రిప్ట్ ను రెడీ చేసారు.