పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా బ్రో. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి దశలవారీగా లిరికల్ వీడియోస్ విడుదల చేసే కార్యక్రమం జరుగుతోంది. అయితే మిగతా సినిమాలకు భిన్నంగా ఈ సినిమా కోసం కాస్త కొత్తగా ట్రై చేస్తున్నారు.
బ్రో సినిమాకు సంబంధించి ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. త్వరలోనే శ్లోకం ఎక్స్ టెండెడ్ వెర్షన్ ను రిలీజ్ చేస్తారు. ఈ 3 సాంగ్స్ తో బ్రో లిరికల్ సాంగ్స్ కార్యక్రమాన్ని ఆపేస్తున్నారు.
అలా అని ఈ సినిమాలో ఇవే సాంగ్స్ ఉన్నాయనుకుంటే పొరపాటు. మరో 3 సాంగ్స్ కూడా ఉన్నాయి. అయితే వాటిని రిలీజ్ చేయడం లేదు. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తమన్ ఈ మేటర్ ను బయటపెట్టాడు.
“బ్రో సినిమాకు సంబంధించి ఓ శ్లోకం త్వరలోనే వస్తుంది. అది కాకుండా మరో 3 పాటలున్నాయి. వాటిని రిలీజ్ చేయడం లేదు. సినిమా నుంచే ఆ పాటలొస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రోజున వాటిని పెర్ ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాను.”
సో.. తమన్ చెప్పిన ప్రకారం చూసుకుంటే.. త్వరలోనే బ్రో సినిమా నుంచి లిరికల్ వీడియోస్ రాక ఆగిపోతుంది. ఓ విధంగా ఇది మంచి ఎత్తుగడే. విడుదలకు కేవలం కొన్ని రోజుల టైమ్ మాత్రమే ఉన్న నేపథ్యంలో, సాంగ్స్ రిలీజ్ చేసి, అవి క్లిక్ అవ్వకపోతే, సినిమాపై హైప్ తగ్గుతుంది.
పైగా 'జాణవులే సాంగ్' కు మిక్స్ డ్ రెస్పాన్స్ రావడంతో, మిగతా పాటల్ని రిలీజ్ చేయకుండా ఆపేయడమే మంచిది. నిజంగా ఆ సాంగ్స్ బాగుంటే.. సినిమా రిలీజైన తర్వాత ఆటోమేటిగ్గా హిట్టవుతాయి. 'అల వైకుంఠపురములో' సినిమాలోని కొన్ని పాటల విషయంలో ఇలా జరిగింది కూడా.