హీరో విజయ్ కు ఊహించని షాక్

హీరో విజయ్ కలలో కూడా ఊహించని షాక్ ఇది. సాధారణంగా ఏ సినిమాకైనా పైరసీ కామన్. పెద్ద హీరోల సినిమాలు కచ్చితంగా పైరసీ అవుతాయి. అయితే ఈ విషయంలో హీరో విజయ్ కు ఊహించని…

హీరో విజయ్ కలలో కూడా ఊహించని షాక్ ఇది. సాధారణంగా ఏ సినిమాకైనా పైరసీ కామన్. పెద్ద హీరోల సినిమాలు కచ్చితంగా పైరసీ అవుతాయి. అయితే ఈ విషయంలో హీరో విజయ్ కు ఊహించని షాక్ ఎదురైంది.

ఈరోజు విజయ్ హీరోగా నటించిన లియో సినిమా థియేటర్లలోకి వచ్చింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే.. తమిళనాడులో ఈ సినిమా విడుదలతో పాటు, పైరసీ ప్రింట్ కూడా ఆన్ లైన్ లో రిలీజైంది.

ఈ సినిమా పైరసీ ఓవర్సీస్ లోనే జరిగిందనే విషయం ఈజీగా అర్థమౌతోంది. అయితే తమిళనాట ఇలా థియేటర్లలో విడుదలవ్వడంతోనే, అలా ఆన్ లైన్ లో కూడా పైరసీ వెర్షన్ కనిపించడం బాధాకరం. లియో సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోలకు తమిళనాట అనుమతి రాలేదు. దీంతో సినిమాతో పాటు పైరసీ కాపీ కూడా ఒకేసారి రిలీజైనట్టయింది.

తమిళ హీరోలకు ఓ పైరసీ సైట్ గతంలో బహిరంగ హెచ్చరిక చేసిన విషయం తెలిసిందే. పెద్ద హీరోల సినిమాల్ని క్షణాల్లో పైరసీ చేస్తామని ఓ పైరసీ సైట్ ప్రకటించింది. చెప్పినట్టుగానే ఆమధ్య విశాల్ సినిమాను, ఇప్పుడు విజయ్ సినిమాను నిమిషాల వ్యవథిలో ఆన్ లైన్ లో పెట్టేసింది.

మొదటి రోజే వంద కోట్లు.. మరోవైపు ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా.. లియో సినిమా మొదటి రోజే వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయబోతోంది. తాజా సమాచారం ప్రకారం, ఇండియా నుంచి ఈ సినిమాకు 65-70 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చే అవకాశం ఉంది. అటు ఓవర్సీస్ వసూళ్లు కూడా కలుపుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజే అటుఇటుగా 120 కోట్ల రూపాయల గ్రాస్ సాధించేలా కనిపిస్తోంది.

లోకేష్ కనగరాజ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్  మీనన్ లాంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు.