Advertisement

Advertisement


Home > Movies - Movie News

హిందీ విక్ర‌మ్ వేదా టాక్.. తెలుగు రీమేక్ కు సై?

హిందీ విక్ర‌మ్ వేదా టాక్..  తెలుగు రీమేక్ కు సై?

ఎప్పుడో ఐదేళ్ల కింద‌ట త‌మిళంలో వ‌చ్చిన *విక్ర‌మ్ వేదా* అప్ప‌ట్లోనే క‌ల్ట్ హిట్ గా నిలిచింది. త‌మిళ ప్రేక్ష‌కుల‌తో పాటు సౌత్ సినీ ప్రియుల‌ను ఆ సినిమా ఆక‌ర్షించింది. త‌మిళంలో ఆ సినిమా హిట్ కావ‌డంతో.. ఆ వెంట‌నే తెలుగులో ఆ సినిమాను రీమేక్ చేయ‌నున్నార‌నే పుకార్లు, వార్త‌లు వస్తూనే ఉన్నాయి. అయితే విక్ర‌మ్ వేదా తెలుగు రీమేక్ మాత్రం ప‌ట్టాలెక్క‌లేదు.

ఇంత‌లో ఈ సినిమా పై హిందీ వాళ్లు క‌న్నేశారు. హిందీలో హృతిక్ రోష‌న్, సైఫ్ అలీఖాన్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ సినిమా రీమేక్ అయ్యింది. ఆ సినిమా విడుద‌ల నేప‌థ్యంలో స‌ర్వ‌త్రా మంచి రేటింగులు వ‌స్తుండ‌టం గ‌మ‌నార్హం. ఐదుకు మూడు, అంత‌కు మించిన స్థాయిలో ఈ సినిమా రేటింగులు పొందుతోంది. త‌మిళ వెర్ష‌న్ కు హిందీ రీమేక్ న్యాయం చేసిన‌ట్టుగానే ఉంది. 

ఇలా త‌మిళ సినిమా రీమేక్ బాలీవుడ్ కొన్నాళ్లుగా వేచి చూస్తున్న హిట్ ను ఇస్తోంది. మ‌రి ఇదే స‌మ‌యంలో అర‌వ సినిమా తెలుగు రీమేక్ కు కూడా బాలీవుడ్ ఫ‌లితం ఊపునిచ్చే అవ‌కాశం ఉంది. త‌మిళంలోనే గాక హిందీలో కూడా అదే కథ హిట్ అయితే, తెలుగు రీమేక్ కు ఉత్సాహాన్నిచ్చే అవ‌కాశాలున్న‌ట్టే.

ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ విష‌యంలో ర‌వితేజ పేరు బాగా వినిపిస్తోంది. అలాగే నాగార్జున‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ల పేర్లు కూడా వివిధ సంద‌ర్భాల్లో వినిపించాయి. ఇంకా అనేక మంది హీరోల పేర్లు విక్ర‌మ్ వేదా రీమేక్ విష‌యంలో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. ఇప్పుడు హిందీ వెర్ష‌న్ పాజిటివ్ టాక్ నేప‌థ్యంలో.. ఈ ప్ర‌య‌త్నాలు వేగ‌వంతం అయ్యే అవ‌కాశాలు లేక‌పోలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?