Advertisement

Advertisement


Home > Movies - Movie News

మరీ ఘోరంగా తయారైన సీనియర్ హీరో పరిస్థితి

మరీ ఘోరంగా తయారైన సీనియర్ హీరో పరిస్థితి

ఒకప్పుడు స్టార్ హీరో. అతడి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురు చూసేవారు. ఒకదశలో అతడ్ని పరభాషా నటుడిగా కూడా చూడలేదు తెలుగు ఆడియన్స్. అలా తన నటనతో, మంచి కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న విక్రమ్, ఇప్పుడు టాలీవుడ్ కు పూర్తిగా దూరమయ్యాడు. అతడి సినిమాల్ని ఇప్పుడిక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు.

రీసెంట్ గా విక్రమ్ నటించిన మిస్టర్ కెకె సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా వచ్చిన విషయాన్ని కూడా జనాలు పట్టించుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరీ బాధాకరమైన విషయం ఏంటంటే.. మొన్న రిలీజైన ఈ సినిమాను వీకెండ్ పూర్తయ్యేవరకు కూడా థియేటర్లలో ఉంచడంలేదు.

హైదరాబాద్ తో పాటు ఆంధ్రలోని చాలా పట్టణాల్లో మిస్టర్ కెకె సినిమాను తొలిగించారు. ఆ స్థానంలో ఇస్మార్ట్ శంకర్, ఓ బేబీ సినిమాల్ని ఆడిస్తున్నారు. అలా శుక్రవారం రిలీజైన ఈ సినిమా చాలా సెంటర్లలో శనివారానికే దుకాణం సర్దేసింది.

నిజానికి మిస్టర్ కెకె సినిమాలో విషయం కూడా లేదు. యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్ని వెదుక్కోవాల్సి వచ్చింది. దీనికితోడు విక్రమ్ గెటప్ కూడా ఆడియన్స్ కు ఎక్కలేదు. కమర్షియల్ ఫార్మాట్ కు దూరంగా ఉండడం, యాక్షన్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడంతో మిస్టర్ కెకె సినిమా వీకెండ్ కూడా ముగియకుండానే తన కథ ముగించింది.

అలా తెలుగులో మరోసారి ఫ్లాప్ హీరోగా నిలిచిపోయాడు విక్రమ్.

జగన్‌ మొహంలో చిరునవ్వు మార్పు కనబడుతోంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?