విల్లు ఎక్కుపెట్టిన నాగశౌర్య

ఛలో, అశ్వద్దామ, ఓ బేబీ లాంటి మంచి సినిమాలు అందించిన హీరో నాగశౌర్య లాక్ డౌన్ తరువాత వరుసగా సినిమాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో…

ఛలో, అశ్వద్దామ, ఓ బేబీ లాంటి మంచి సినిమాలు అందించిన హీరో నాగశౌర్య లాక్ డౌన్ తరువాత వరుసగా సినిమాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో ఒకటి, ఆసియన్ సునీల్-శరత్ మరార్ నిర్మాణంలో మరొకటి,  కొత్తనిర్మాతలతో మరొకటి, ఇలా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు సెట్ మీదకు వెళ్లడానికి రెడీగా వున్నాయి.

సుబ్రహ్మణ్యపురం సినిమా అందించిన దర్శకుడు సంతోష్ డైరక్షన్ లో ఏసియన్ సునీల్-శరత్ మరార్ నిర్మించే సినిమా ఫస్ట్ లుక్ ను ఈ రోజు ఆన్ లైన్ లో విడుదల చేసారు. విలువిద్య నేపథ్యంలో తయారుచేసిన కథతో ఈ సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం నాగశౌర్య లాక్ డౌన్ టైమ్ లో సిక్స్ బ్యాక్ చేసి, ఫుల్ ఫిట్ నెస్ తో రెడీ అయ్యాడు.

ఇప్పుడు ఆ లుక్ నే విడుదల చేసారు. టాప్ లెస్ గా సిక్స్ ప్యాక్ లుక్ తో విలుకాడిగా శౌర్య కనిపించాడు. ఈ లుక్ నే చెబుతోంది సినిమా లైన్, లెంగ్త్ ఏమిటన్నది. మొత్తం మీద ప్రామిసింగ్ ప్రాజెక్టులతో ముందుకు వెళ్తున్నాడు శౌర్య.

కాపీ పేస్టులు చేసేవాళ్ళు కూడా రివ్యూ రైటర్లు అయిపోయారు

జగన్ దేశంలోనే గొప్ప నాయకుడవుతాడు