cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

అమెరికా జాత్యహంకారంపై హాట్ బ్యూటీ వినూత్న నిర‌స‌న‌

అమెరికా జాత్యహంకారంపై హాట్ బ్యూటీ వినూత్న నిర‌స‌న‌

అమెరికాలో హెచ్చుమీరిన జాత్య‌హంకారంపై ప్ర‌పంచ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓ హాట్ హీరోయిన్ వినూత్న నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇందుకోసం ఆమె బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్‌లో పాల్గొని...ఆ త‌ర్వాత ఏం చేసిందో తెలుసుకోవాల్సిందే. ఆ నిర‌స‌న తెలిపిన హాట్ హీరోయిన్ విమ‌లారామ‌న్‌.

'పోయ్' అనే తమిళ చిత్రంతో 2005లో వెండితెరకి హీరోయిన్‌గా విమలా రామన్ ప‌రిచ‌యం అయ్యారు. మొద‌ట్లో ఆమె మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టారు. ఆ త‌ర్వాత  త‌న అంద‌చందాల‌ను ఆర‌బోస్తూ హాట్ బ్యూటీగా చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో పేరు సంపాదించారు.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించ‌డంతోనే  మంచి అవకాశాలను దక్కించుకున్నారు.  వరుణ్ సందేశ్ సరసన నటించిన  'ఎవరైనా ఎపుడైనా' సినిమాతో టాలీవుడ్‌లోకి విమ‌ల ఎంట్రీ ఇచ్చారు.  ప్రస్తుతం వెబ్ సీరీస్‌లలో నటిస్తోన్న విమలా రామన్‌కు అభిమానులు కావాల్సినంత మంది ఉన్నారు. ఆమెకు సామాజిక స్పృహ కూడా ఎక్కువే. దానికి నిద‌ర్శ‌నం తాజాగా అమెరికాలో జరుగుతున్న జాత్యహంకారంపై ఆమె  వినూత్న నిర‌స‌నే నిద‌ర్శ‌నం.

ప్ర‌స్తుతం సినిమాలేవీ లేక‌పోయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చేస్తున్నారామె.  తాజాగా  స్కిన్ షో చేసి వార్తల్లో నిలిచారు.  ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార ధోర‌ణుల‌కు  వ్యతిరేకంగా ఈ హాట్ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్ ఫోటో షూట్‌లో పాల్గొన్నారు.

బ్లాక్ సూట్ వేసుకున్న ఈ భామ‌ ..టాప్ బటన్స్ పెట్టకుండా కెమెరా ముందు అమాయ‌క చూపుల‌తో  ఫోజులిచ్చారు.  ఈ  హీరోయిన్ అందాలు  సోషల్ మీడియాలో వైరల్ ఆవుతూ కుర్ర‌కారును మ‌త్తెక్కిస్తున్నాయి.

నువ్వు ఎలాంటోడివో మీ అబ్బాయే చెప్పాడు

మహేష్ ఙోకులు మామూలుగా వుండవు

టార్గెట్ 175.. కొడతారా? లేదా?