cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

చుక్క‌లాంటి హీరోయిన్‌...ఫొటోలు వైర‌ల్‌

చుక్క‌లాంటి హీరోయిన్‌...ఫొటోలు వైర‌ల్‌

సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని త‌మ‌ను తాము హైలెట్ చేసుకునే వెస‌లుబాటు ద‌క్కింది. సోష‌ల్ మీడియా లేని రోజుల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం చూపితే...అదే ఫొటో, అదే వార్త‌. ఇప్పుడు అలాంటి ఒంటెత్తు పోక‌డ‌ల‌కు కాలం చెల్లింది. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ని ఫొటో కళ్ల ప‌డితే...దానంత‌కు అదే వైర‌ల్ అవుతోంటోంది.

తాజాగా ఒక‌ప్ప‌టి హీరోయిన్ విమ‌లా రామ‌న్ చూడ చ‌క్క‌ని ఫొటోలు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ‘ఎవరైనా ఎప్పుడైనా, గాయం 2, రాజ్, చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ త‌దిత‌ర‌ చిత్రాలతో విమ‌లారామ‌న్ టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచితురాలే. అయితే కాలం క‌లిసిరాక పోవ‌డంతో హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీలో ఆమె నిల‌దొక్కుకోలేక పోయారు.

కానీ ఆమెకు ఓ స్టార్ హీరోయిన్‌కు ఉండాల్సిన అన్ని అర్హ‌త‌లున్నాయి. తాజాగా అందాల తార తన ట్విట్ట‌ర్‌లో రెండు ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో విమ‌లా అందం కుర్ర‌కారును మ‌త్తెక్కించేలా ఉంది. ఎంత సేపు చూసినా త‌నివి తీర‌ని అందంతో, పోత పోసిన సుంద‌రాంగి వ‌లే క‌నిపిస్తూ ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను గిల‌గింత‌లు పెడుతోంది. విమ‌లా గురించి తెలియ‌ని వారంతా ఆశ్చ‌ర్యంతో ఎవ‌రీ కొత్త భామ అంటూ ఆరా తీయ‌డం మొద‌లు పెట్టారు. మొన్న‌టి వ‌ర‌కు బొద్దుగా ఉన్న‌ ఈ భామ ఇప్పుడు స్లిమ్‌గా ప్ర‌త్య‌క్ష‌మైంది.

నాజూకుగా, పాల రాతి విగ్ర‌హం మాదిరి పొడ‌వుగా న్యూలుక్‌లో క‌నిపిస్తున్న విమ‌లా రామన్ అందానికి ముగ్ధులు కానివారు ఉండ‌రు.  ప్రస్తుతం సినిమా అవ‌కాశాలు లేకుండా ఖాళీగా ఉన్న ఈ భామ‌కు అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తాయ‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

తప్పు చెయ్యకపోతే ఎందుకు పారిపోయాడు?

అమరావతిపై కుండబద్దలు కొట్టిన జివిఎల్

 


×