కరోనా జనాన్ని చుట్టేస్తోంది. వీళ్లు, వాళ్లు అనేమీ లేదు. రాని వాళ్లు, వచ్చిన వాళ్లు అన్నట్లు వుంది పరిస్థితి. ఏదో వైరల్ ఫీవర్లు స్టార్ట్ అయితే ఊరంతా వచ్చినట్లుగా వుంది వ్యవహారం. టాలీవుడ్ లో ఇప్పటికే కొంత మందికి వచ్చింది. తగ్గింది. ఇప్పుడు మరో ఇద్దరికి వచ్చినట్లు వినిపిస్తోంది.
ఇద్దరు కూడా ఆంధ్రలోని ఓ కోస్తా ఏరియా డిస్ట్రిబ్యూటర్లు అని తెలుస్తోంది. వీరు వుండేది హైదరాబాద్ లోనే. ఈ ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లలో ఒకరు వుండే గేటెడ్ కమ్యూనిటీలోనే మెగా ఫ్యామిలీకి చెందిన ఒకరు కూడా వుంటారని తెలుస్తోంది. ఇద్దరు డిస్ట్రిబ్యూటర్లలో ఒకరు కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే రూమ్ దొరకలేదని, అడ్మిషన్ మాత్రం దొరికిందని తెలుస్తోంది.
ఇదిలా వుంటే త్వరలో సూపర్ స్టార్ ఒకరితో సినిమా చేయబోయే సంస్థలోని చిరుద్యోగి కి కూడా కరోనా సోకడంతో, ఆ ఆఫీసును తాత్కాలికంగా మూసి వేసారు. దాంతో మొత్తం మీద టాలీవుడ్ లో షూటింగ్ ల సంగతి తాత్కాలికంగా మరుగునపడిపోయింది.