ఎంపీ సుమ‌ల‌త‌కు క‌రోనా పాజిటివ్, ఆమె ఏమ‌న్నారంటే!

క‌రోనా బారి నుంచి ప్ర‌ముఖులు కూడా త‌ప్పించుకోలేక‌పోతున్నారు. ప్ర‌త్యేకించి రాజ‌కీయ నేత‌ల్లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్ర‌మంలో న‌టి సుమ‌ల‌త త‌ను కూడా క‌రోనా పాజిటివ్ గా తేలినట్టుగా…

క‌రోనా బారి నుంచి ప్ర‌ముఖులు కూడా త‌ప్పించుకోలేక‌పోతున్నారు. ప్ర‌త్యేకించి రాజ‌కీయ నేత‌ల్లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ క్ర‌మంలో న‌టి సుమ‌ల‌త త‌ను కూడా క‌రోనా పాజిటివ్ గా తేలినట్టుగా ప్ర‌క‌టించింది. ఆమె త‌న ఫేస్ బుక్ పేజ్ ద్వారా ఈ విష‌యాన్ని షేర్ చేసుకోవ‌డంతో నిర్ధార‌ణ అవుతూ ఉంది. 

శ‌నివారం నుంచి త‌ను త‌ల‌నొప్పి, త్రోట్ ఇన్ఫెక్ష‌న్ తో ఇబ్బంది ప‌డిన‌ట్టుగా తెలిపారు. అనుమానం వ‌చ్చి టెస్టు చేయించుకోగా.. క‌రోనా పాజిటివ్ గా తేలింద‌ని ఆమె వివ‌రించారు. త‌ను పూర్తిగా హోం క్వారెంటైన్లో ఉన్న‌ట్టుగా, డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు మందులు వాడుతున్న‌ట్టుగా తెలిపారు. దేవుడి ద‌య‌తో త‌నకు ఇమ్యూనిటీ ఎక్కువ అని, త‌ను త్వ‌ర‌లోనే పూర్తిగా కోలుకోగ‌ల‌న‌న్న విశ్వాసాన్ని ఆమె వ్య‌క్తం చేశారు. క‌రోనా పాజిటివ్ గా తేలిన వారికి ధైర్య‌మే కీల‌క ఆయుధం అని అనేక మంది చెబుతూ ఉన్నారు. 

త‌ను క‌రోనా పాజిటివ్ అని ప్ర‌క‌టించుకోవ‌డానికి సుమ‌ల‌త వెనుకాడ‌లేదు, అదే  స‌మ‌యంలో త‌ను కోలుకుంటాన‌నే ధీమాను కూడా ఆమె వ్య‌క్తం చేసి.. క‌రోనా విష‌యంలో ప్ర‌జ‌ల్లో నెల‌కొంటున్న భ‌యాందోళ‌న‌ల‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నం చేశార‌ని అనుకోవాలి. 

క‌ర్ణాట‌క‌లో క‌రోనా కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతూ ఉంది. రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా అక్క‌డ క‌రోనా బారిన పడిన వైనాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. బెంగ‌ళూరులో ప్ర‌తి రోజూ కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. మొద‌ట్లో ఉద్యాన న‌గ‌రిలో కేసులు పెద్ద‌గా న‌మోదు కాలేదు. గ‌త వారం నుంచి మాత్రం కేసుల సంఖ్య లో పెరుగుద‌ల ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంది.

తప్పు చెయ్యకపోతే ఎందుకు పారిపోయాడు?