వినరో భాగ్యము..నెంబర్ల కాన్సెప్ట్

గీతా సంస్థ, జిఎ2 నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ నెల 17న విడుదల. ఈ సినిమా ట్రయిలర్ వచ్చేసింది. కాన్సెప్ట్ పాతదే..కొత్తగా మార్చినట్లు కనిపిస్తోంది. పొరుగువాడికి కొంత…

గీతా సంస్థ, జిఎ2 నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ నెల 17న విడుదల. ఈ సినిమా ట్రయిలర్ వచ్చేసింది. కాన్సెప్ట్ పాతదే..కొత్తగా మార్చినట్లు కనిపిస్తోంది. పొరుగువాడికి కొంత సాయపడాలనే సందేశం. అయితే మొబైల్ అన్నదే సర్వస్వమైన కాలంలో మన పొరుగువాడు అంటే మన పక్క నెంబర్ వాడు అన్నది ఈ ట్రయిలర్ లో చెప్పిన కొత్త నిర్వచనం. 

మొబైల్ చివరి నెంబర్ కు ముందు వెనుక నెంబర్లు మన నైబర్స్ అనేది ఈ సినిమా కొత్త కాన్సెప్ట్. ఆ నెంబర్లు మంచి వాళ్లవి అయితే వేరే సంగతి. చెడ్డవాళ్లవి అయితే ఇంకో సంగతి.

హీరో నెంబర్ కు ఓ పక్క ఓ మంచి అమ్మాయి వుంది. కానీ అదే అమ్మాయి నెంబర్ అటు పక్క ఓ దుర్మార్గుడు వున్నాడు. చెప్పుకోవడం వరకు బాగానే వుంది. కానీ కొత్త దర్శకుడు అబ్బూరి దీని చుట్టూ ఎలాంటి కథ, ఏ విధంగా అల్లుకున్నారు అన్నదాన్ని బట్టి వుంటుంది సినిమా. ట్రయిలర్ అయితే కాస్త ఇంట్రస్టింగ్ గా కట్ చేయాలని ప్రయత్నం అయితే చేసారు. రకరకాల లేయర్లు వున్న కథ అనేలా వుంది ట్రయిలర్. అందుకే ఒకదానితో ఒకదానికి పొంతన లేని సీన్లు అన్నీ పరుచుకున్నాయి.

తిరుపతి నేపథ్యంలో తీసిన ఈ చిత్రంలో మురళీశర్మ తో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ చేయించినట్లు కనిపిస్తోంది. కిరణ్ అబ్బవర్ నటన రెగ్యులర్ నే. హీరోయిన్ కు ట్రయిలర్ లో మరీ ఎక్కువ ప్లేస్ లేదు. టోటల్ గా ట్రయిలర్ చూస్తే సినిమా చూసి కానీ కాన్సెప్ట్ క్లిక్ కావడం డిసైడ్ కాలేము అన్న రీతిగా వుంది.