లవ్ స్టోరీతో కెరీర్ మొదలుపెట్టిన కిరణ్ అబ్బవరం, చాలా జానర్లు ట్రై చేశాడు. రీసెంట్ గా ఏదీ వర్కవుట్ కాలేదు. దీంతో ఈసారి ఏకంగా జానర్లు అన్నీ కలిపికొట్టాడు ఈ హీరో. అదే వినరో భాగ్యము విష్ణుకథ. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. తమ సినిమా జానర్ ఏంటనేది ఈ టీజర్ లో క్లియర్ గా చెప్పాడు అబ్బవరం.
కాన్సెప్ట్ తో మొదలై లవ్-కామెడీ మిక్స్ అయి, క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే, ఓ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ఈ సినిమా. ఈ పదప్రయోగం మేం పుట్టించింది కాదు, స్వయంగా అందులో నటించిన కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ ఇది.
టీజర్ కు రిలీజ్ కు ముందు ఈ సినిమా జానర్ గెస్ చేయమని ఓ చిన్న కాంటెస్ట్ లాంటిది వదిలారు. ఇలా ఎవ్వరూ గెస్ చేయని విధంగా అన్ని జానర్లు కలిపి సినిమా తీస్తున్నారనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతుంది.
టీజర్ లో ఎప్పట్లానే తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు అబ్బవరం. చివర్లో వచ్చిన 'అల వైకుంఠపురములో' స్పూఫ్ బాగుంది. గీతాఆర్ట్స్2 బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాను వచ్చేనెల 17న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు.
కిరణ్ అబ్బవరం సరసన కశ్మీరా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను బన్నీ వాస్ నిర్మించాడు. చైతన్ భరధ్వాజ్ సంగీతం అందించాడు.