వినరో భాగ్యము విష్ణు కథ సినిమా బాగుంటుందని తాను కచ్చితంగా నమ్ముతున్నానని, యంగ్ హీరో అక్కినేని అఖిల్ అన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అఖిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్‌కు అతిథిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా హాజరయ్యానని అన్నారు. ఇంత సాధించినా అల్లు అరవింద్ కు మంచి కంటెంట్ మరియు మంచి సినిమా తీయాలనే కోరిక ఇంకా ఉందని అఖిల్ అన్నారు. బన్నీ వాసు కంటెంట్ నమ్మితే సినిమా కోసం కష్టపడతాడు.ఈ సినిమా చాలా బాగుంటుంది అని నా నమ్మకం అని చెబుతూ,టీమ్ మొత్తానికి ఈ సినిమా మంచి విజయం అందించాలని శుభాకాంక్షలు తెలిపారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్‌పై తనకు నమ్మకం ఉందని, ఆ నమ్మకం ఎందుకో ఫిబ్రవరి 18న ప్రేక్షకులకు తెలుస్తుందని చెప్పారు. ఈ సినిమాకు టెక్నికల్ సపోర్ట్ బాగా దొరికిందని, మంచి పాటలు కుదిరాయని అన్నారు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలనే తపనతో సరైన గైడెన్స్ లేకుండా సినిమాలు చేయాలనే తొందరలో పడ్డాను. ప్రస్తుతం నిర్మాత అల్లు అరవింద్ సహకారంతో మంచి సినిమాలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మెల్లగా నేర్చుకుంటున్నాను. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రతీవారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ…. కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ, “చాలా తక్కువ మంది జెన్యూన్ పీపుల్ ఉంటారు అందులో కిరణ్ ఒకరు, నిజాయితీ గా మాట్లాడుతాడు. ఈ సినిమాను మామూలుగా చూసినప్పటి కంటే బ్యాక్గరౌండ్ స్కోర్ తో చూసినప్పుడు నెక్స్ట్ లెవెల్ అనిపించింది.ఈ సినిమాకి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు అన్నారు.
నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ..టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అల్లు అరవింద్, అఖిల్ మరియు కిరణ్ అబ్బవరంపై ప్రశంసలు కురిపించారు. సినిమాలో ప్రేక్షకులకు నచ్చే విధంగా ఫైట్స్ ఉన్నాయని. ఆ రేంజ్‌లో, చైతన్ భరద్వాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడని చెప్పుకొస్తూ,ఈ చిత్రం అతనికి పెద్ద బ్రేక్ అవుతుందని నమ్ముతున్నాను అన్నారు. ఈ సినిమా ఎంత స్వఛ్చంగా ఉంటుందో ఈ సినిమా డైరెక్టర్ అంత స్వఛ్చమైన మనిషి. ఈ సినిమాలో కొన్ని విషయాలు గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారు అన్నారు.