విరూపాక్ష-ఇంట్రస్టింగ్ థ్రిల్లర్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష టీజర్ విడుదలయింది. దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. భోగవిల్లి ప్రసాద్ నిర్మాత. దండు కార్తీక్ వర్మ దర్శకుడు. కోవిడ్…

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష టీజర్ విడుదలయింది. దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. భోగవిల్లి ప్రసాద్ నిర్మాత. దండు కార్తీక్ వర్మ దర్శకుడు. కోవిడ్ తరువాత కావచ్చు. లేదా 2023 లో కావచ్చు. 

సాదా సీదా సినిమాలు జనాలకు సరిపోవడం లేదు. సమ్ థింగ్ ఇంట్రస్టింగ్ గా వుండాలి. లేదా ఇంట్రస్టింగ్ చెప్పాలి. కాదూ అంటే ఇంట్రస్టింగ్ జానర్ కావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే విరూపాక్ష సినిమాను తీస్తున్నట్లుంది.

టీజర్ చూడగానే ఏదో సమ్ థింగ్ వుంది అనిపించేలా కట్ చేసారు. ఈ తరహా థ్రిల్లర్లు కొత్త అని కాదు. అదే జానర్ లో కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేసారు. గట్టి ప్రమాదం జరిగి కోలుకున్న తరువాత హీరో తేజ్ చేస్తున్న సినిమా ఇది. కొన్ని సీన్లలో ఆ తేడా కొంచెం కనిపించింది. ఇంట్రస్టింగ్ సీన్లు అన్నీ టీజర్ లోకి చేరాయి. బ్యాక్ గ్రవుండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ప్లస్ అయింది. టోటల్ గా టీజర్ సినిమాకు మాంచి బజ్ తీసుకువచ్చే పైలట్ ఎపిసోడ్ గా బాగా ఉపయోగపడేలాగే వుంది.

ఏప్రిల్ మూడోవారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీని తరువాత సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మరో రెండు మూడు సినిమాలు లైన్ లో వున్నాయి.